- Telugu News Photo Gallery Technology photos Have A look on smartphones under 25000. Features and price details
Smartphone under 25K: స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా.? రూ. 25 వేలలోపు బెస్ట్ ఫీచర్లున్న ఫోన్‌లు ఇవే..
Smartphone under 25K: కొత్తగా స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా.? అయితే మీ బడ్జెట్ రూ. 25 వేల లోపా.? అయితే మీ బడ్జెట్‌లో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ స్మార్ట్ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
Updated on: Nov 21, 2021 | 12:50 PM

iQOO Z5 5G/Z3 5G: వివో సబ్ బ్రాండ్ అయిన ఐక్యూ జెడ్5 8 జీబీ+128 జీబీ వెర్షన్ ఫోన్ రూ. 22,990 కి అందుబాటులో ఉంది. ఇందులో స్నాగ్‌డ్రాగన్ 768 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించారు. 6.58 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ +ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. 64 ఎంపీ రెయిర్ కెమెరాతో పాటు 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను ఇచ్చారు.

Mi 10i 5G: రూ. 25 వేల లోపు అందుబాటులో ఉన్న మరో బెస్ట్ స్మార్ట్ ఫోన్ ఇది. ఇందులో 108 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 750 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో 6.67 ఇంచెస్ స్క్రీన్‌ను అందించారు. ధర విషయానికొస్తే రూ. 21,999కి అందుబాటులో ఉంది.

Poco X3 Pro: ఈ ఫోన్‌లో 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. ఇందులో 48 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు 20 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. 5,160 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 20,999గా ఉంది.

Samsung Galaxy F62: ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.7 అంగుళాల సూపర్ అమోఎల్‌ఈడీ ప్లస్ డిస్‌ప్లేను అందించారు. ఇక 7000 ఎమ్‌ఏహెచ్ సామర్థం ఉన్న బ్యాటరీ ఈ ఫోన్ మరో ప్రత్యేకత. 64 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, 32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. ఈ ఫోన్ ధర విషయానికొస్తే రూ. 23,590గా ఉంది.





























