- Telugu News Photo Gallery Technology photos Google will delete your Gmail and YouTube accounts if you not doing this, check details
Gmail: జీమెయిల్ ఓపెన్ చేయక చాలా రోజులు అవుతోందా.? అయితే ఈ న్యూస్ మీ కోసమే…
మీకు జీమెయిల్ అకౌంట్ ఉందా.? అకౌంట్‌ను ఎప్పుడో ఒకప్పుడు కానీ ఉపయోగించడం లేదా.? అయితే మీ అకౌంట్‌ను గూగుల్ శాశ్వతంగా తొలగిస్తుంది జాగ్రత్త. గూగుల్ తీసుకొచ్చిన కొత్త ఇన్‌యాక్టివ్ అకౌంట్ పాలసీలో మార్పులే దీనికి కారణం. ఇంతకీ అకౌంట్స్‌ను ఎందుకు తొలగించనున్నారు.? యాక్టివ్‌గా ఉంచుకోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..
Updated on: Jul 23, 2023 | 5:05 PM

ప్రస్తుత రోజుల్లో జీమెయిల్‌ను ఉపయోగించని వారు ఉండరనడంలో ఎలాంటి సందేహం లేదు. అవసరం ఉన్నా లేకున్నా ప్రతీ ఒక్కరూ మెయిల్ ఐడీని ఓపెన్ చేస్తున్నారు. అయితే కొందరు మెయిల్‌ను అస్సలు ఓపెన్ చేయరు. ఓపెన్ చేసిన దానిని అలా వదిలేస్తారు. మీరు కూడా ఇలాగే చేస్తున్నారా.? అయితే గూగుల్ మీ జీమెయిల్ అకౌంట్‌ను తొలగిస్తుంది జాగ్రత్త.

అవును ఉపయోగంలో లేని అకౌంట్‌లకు సంబంధించి గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. రెండేళ్లకు మించి ఉపయోగంలో లేని జీ-మెయిల్, యూట్యూబ్ ఖాతాలను తొలగించనుంది. ఇన్‌యాక్టివ్ అకౌంట్ పాలసీలో మార్పులు చేసింది. ఇన్‌యాక్టివ్ అకౌంట్స్‌ను హ్యాక్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందన్న కారణంతో గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ కొత్త విధానం 2023 డిసెంబర్ నుంచి అమల్లోకి రానుంది. ఈ లోగా యూజర్లు తమ ఖాతాలను యాక్టివేట్ చేసుకోవాలని లేదంటే మొత్తం డేటా డిలీట్ అవుతుందని గూగుల్ యూజర్లను హెచ్చరించింది.

అకౌంట్ యాక్టివేట్ చేసుకోవాలనుకునే వారు.. అప్పుడప్పుడు మెయిల్స్‌ను ఓపెన్ చేసి చూస్తుండాలి. గూగుల్ డ్రైవ్‌ను వారంలో ఒకసారైనా ఓపెన్ చేసి చూడండి. జీమెయిల్ ద్వారా లాగిన్ అయ్ఇయ యూట్యూబ్ వీడియోలను చూడాలి.

అలాగే గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఏదైనా యాప్‌ను డౌన్‌లోడ్ చేస్తుండాలి. జీ మెయిల్ ఖాతాతో ఏదైనా యాప్‌లోకి లాగిన్ అవ్వండి. ఇలా చేయడం వల్ల మీ జీమెయిల్ ఖాతా నిత్యం యాక్టివ్‌గా ఉంటుంది.





























