- Telugu News Photo Gallery Technology photos Google launches new foldable smartphone Google Pixel 9 Pro Fold features and price details
Google Pixel: గూగుల్ నుంచి ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది.. ధర ఎంతో తెలిస్తే షాక్..
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం గూగుల్ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. ప్రస్తుతం మార్కెట్లో ఫోల్డబుల్ ఫోన్స్ హవా నడుస్తోన్న తరుణంలో గూగుల్ తన తొలి ఫోల్డబుల్ ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఇంతకీ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Aug 19, 2024 | 1:26 PM

గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ ఫోన్ టెన్సార్ జీ4 ప్రాసెసర్‌పై పని చేస్తుంది. ఈ ఫోన్‌లో 8 ఇంచెస్‌తో కూడిన ఇన్నర్ డిస్‌ప్లే, 6.3 అంగుళాల కవర్ డిస్‌ప్లేను అందించారు. ఇక బ్యాటరీ విషయానికొస్తే ఈ ఫోన్‌లో 45 వాట్స్ ఫాస్ట్‌ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4650 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.

ధర విషయానికొస్తే 16 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 1,72,999గా నిర్ణయించారు. ఈ ఫోన్‌ను ఆబ్సీడియన్, పోర్స్‌లెయిన్ కలర్స్‌లో తీసుకొచ్చారు. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు.. క్రోమా, రిలయన్స్ డిజిటల్ అవుట్ లెట్స్‌లో అందుబాటులోకి వచ్చాయి.

ఇక గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ మొబైల్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంపై పని చేస్తుంది. స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం ఇందులో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ ద్వారా స్క్రీన్‌కు ప్రొటెక్షన్ అందించనున్నారు. బయటవైపు 6.3 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు.

కెమెరా విషయానికొస్తే ఇందులో బయటవైపు 48 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాను అందించారు. అలాగే.. 10.5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 10.8 మెగాపిక్సెల్ టెలిఫొటో కెమెరాను ఇచ్చారు. 5x ఆప్టికల్ జూమ్, 20x సూపర్ రెస్ జూమ్ వంటి ఫీచర్లు ఈ ఫోన్ సొంతం.

కనెక్టివిటీ విషయానికొస్తే ఈ ఫోన్‌లో 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 7, బ్లూటూత్ వీ5.3, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, అల్ట్రా వైడ్ బ్యాండ్, యూఎస్‌బీ 3.2 టైప్-సీ పోర్టు వంటి ఫీచర్లను అందించారు. సెక్యూరిటీ కోసం ఫేస్ అన్‌లాక్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్లను ప్రత్యేకంగా అందించారు.




