- Telugu News Photo Gallery Technology photos Get your iphone16 in just 10 minutes bigbasket and blinkit offer quick delivery
iPhone16: యాపిల్ లవర్స్‌కి పండగే.. 10 నిమిషాల్లో ఇంటికి ఐఫోన్16 డెలివరీ
మార్కెట్లోకి వచ్చిన ఐఫోన్16 కోసం కస్టమర్లు ఎగబడుతున్నారు. తాజాగా ముంబయిలోని యాపిల్ స్టోర్ వద్ద జనాలు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. పోటీ పడీ స్టోర్‌లోకి పరగులు పెట్టారు. దీనిబట్టే ఐఫోన్ క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇలాంటి ఇబ్బంది ఏం లేకుండా. నేరుగా ఇంటికే, అది కూడా కేవలం 10 నిమిషాల్లో ఫోన్ మీ చేతుల్లోకి వస్తే భలే ఉంటుంది కదూ!
Updated on: Sep 20, 2024 | 12:30 PM

ఐఫోన్ 16 ఫోన్ కోసం కస్టమర్లు షోరూమ్‌ల వద్ద కుస్తీలు పడుతోన్న తరుణంలో టాటా కీలక నిర్ణయం తీసుకుంది. తమ నిత్యావసరాల సరఫరా యాప్ బిగ్ బాస్కెట్ ద్వారా నిమిషాల వ్యవధిలోనే ఫోన్‌లను డెలివరీ చేసేలా సన్నాహాలు చేసింది. ఇందులో భాగంగానే క్రోమ్‌తో కలిసి బిగ్‌బాస్కెట్ పనిచేస్తోంది.

కస్టమర్లు ఫోన్‌ను బుక్ చేసుకున్న కేవలం 10 నిమిషాల్లోనే చేతికి అందించనున్నారు సెప్టెంబర్ 20వ తేదీ నుంచి ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే తొలుత ఎంపిక చేసిన కొన్ని నగరాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ సేవుల ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తో పాటు ముంబయిలో అందుబాటులోకి వచ్చాయి.

త్వరలోనే ఇతర నగరాల్లో కూడా ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని బిగ్‌బాస్కెట్ సీఈవో హరి మేనన్ తెలిపారు. ఎలక్ట్రానిక్ విభాగంలో తమ ప్రస్థానానికి ఇది కేవలం ప్రారంభం మాత్రమే అన్న ఆయన.. తమ కస్టమర్లు అత్యాధునిక టెక్నాలజీని ఎటువంటి వెయిటింగ్ పీరియడ్ లేకుండా ఎంజాయ్ చేసేలా చేస్తాం. త్వరలోనే అత్యాధునిక ఎలాక్ట్రానిక్ పరికరాలను అందుబాటులోకి తెస్తామని తెలిపారు.

ఇదిలా ఉంటే మరో క్విక్ ఈ కామర్స్ సంస్థ అయిన బ్లింకిట్ సైతం ఐఫోన్16 డెలివరీలపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగానే యూనికార్న్ సోర్స్‌తో ఒప్పందం చేసుకొంది. ఆర్డర్ చేసిన కేవలం 15 నిమిషాల్లోనే ఐఫోన్‌ను డెలివరీ చేయనున్నారు. అంతేకాకుండా ఇన్‌స్టంట్ డెలివరీల్లో బ్లింకిట్ ఆఫర్లను ప్రకటించింది. పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 5000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది.

ఇక ప్రస్తుతం ఐఫోన్ 16 అమ్మకాలు మొదలయ్యాయి. యాపిల్ ఇటీవల ఐఫోన్16 సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రొ, ఐఫోన్ ప్రొ మ్యాక్స్ వేరియంట్స్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అధునాతన ఫీచర్లతో తీసుకొచ్చిన ఐఫోన్ 16 ప్రారంభ వేరియంట్ ధర రూ. 79,900కాగా, హైఎండ్ ధర రూ. 1,44,900గా నిర్ణయించారు.




