- Telugu News Photo Gallery Technology photos Dell launches new laptop with almost 3 lakh rupees Dell alienware m18 r2 Features and price details
Dell Alienware m18 R2: మార్కెట్లోకి రూ. 3 లక్షల ల్యాప్‌టాప్.. ఫీచర్లు అలా ఉన్నాయి మరి..
మార్కెట్లోకి కొత్త కొత్త ల్యాప్‌టాప్స్‌ను లాంచ్ చేస్తూ వస్తున్నాయి ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజ సంస్థలు. అయితే తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం డెల్ ప్రీమియం మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని ఓ అదిరిపోయే ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చింది. డెల్ అలైన్‌వేర్ ఎమ్18ఆర్2 పేరుతో ఈ ల్యాప్‌టాప్‌ను గురువారం లాంచ్ చేశారు. ఇంతకీ ల్యాప్‌టాప్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Mar 16, 2024 | 11:24 PM

ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం డెల్ గురువారం భారత మార్కెట్లోకి కొత్త ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేసింది. డెల్ అలైన్‌వేర్ ఎమ్18ఆర్2 పేరుతో తీసుకొచ్చిన ఈ ప్రీమియం ల్యాప్‌టాప్ ధర ఏకంగా రూ. 2,96,490గా నిర్ణయించారు. ఇంతకీ ఈ ల్యాప్‌టాప్‌లో ఉన్న ఫీచర్లు ఏంటంటే.

డెల్ అలైన్‌వేర్ ల్యాప్‌టాప్‌ను 14th జెన్ Intel Core i7 ప్రాసెసర్‌తో తీసుకొచ్చారు. ఈ ల్యాప్‌టాప్‌ను మూడు రకాల CPU ఆప్షన్స్‌లో లాంచ్ చేవశారు. ఈ ల్యాప్‌టాప్‌ను డెల్ స్టోర్స్‌తో పాటు ప్రముఖ ఈ కామర్స్ సైట్స్ అమెజాన్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఇక ఈ ల్యాప్‌టాప్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 18 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. 1,920 x 1,200 పిక్సెల్‌తో కూడి రిజల్యూషన్ ఈ స్క్రీన్ సొంతం.

విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ ప్రీ ఇన్‌స్టాల్‌తో ఈ ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చారు. ఇందులో 64 జీబీ వరకు డ్యూయల్ చానల్ DDR5 RAMతో పాటు, 4TB/8TB వరకు డ్యూయల్ స్టోరేజ్‌ను అందించారు.

బ్యాటరీ విషయానికొస్తే 97డబ్ల్యూహెచ్ కెపాసిటీతో అందించారు. ఇది 360W వరకు చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తోంది. ఇక ఇందులో ప్రత్యేకంగా అలైన్‌వేర్ క్రియో టెక్ అనే కూలింగ్ టెక్నాలజీని అందించారు. అఆలగే అలైన్‌ఎఫ్‌ఎక్స్ లైటింగ్, డాల్బీ విజన్, డాల్బీ ఆటమ్స్‌కు ఇది సపోర్ట్ చేస్తుంది.




