- Telugu News Photo Gallery Technology photos Media Visibility Will Be Eating Your Smartphone Storage WhatsApp Feature
WhatsApp: వాట్సాప్‌తో మీ ఫోన్ స్టోరేజీ నిండిపోతోందా? ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి
WhatsAppలో స్వీకరించిన ప్రతి ఫోటో, వీడియోలు సాధారణంగా ఫోన్ గ్యాలరీలో సేవ్ అవుతుంటాయి. ఇవి ఫోన్ స్టోరేజీని నింపేస్తుంది. ఇలాంటి సమయంలో మీరు చింతించాల్సిన అవసరం లేదంటున్నారు టెక్ నిపుణులు. మీరు మీ సమస్యను పరిష్కరించగల చిన్న సెట్టింగ్‌ని మారిస్తే సరిపోతుంది. ఫోన్ పూర్తి నిల్వ కారణంగా ఫోన్‌లో సమస్యలు తలెత్తుతుంటాయి. ఇది నేరుగా ఫోన్ పనితీరును..
Updated on: Mar 17, 2024 | 7:25 PM

WhatsAppలో స్వీకరించిన ప్రతి ఫోటో, వీడియోలు సాధారణంగా ఫోన్ గ్యాలరీలో సేవ్ అవుతుంటాయి. ఇవి ఫోన్ స్టోరేజీని నింపేస్తుంది. ఇలాంటి సమయంలో మీరు చింతించాల్సిన అవసరం లేదంటున్నారు టెక్ నిపుణులు. మీరు మీ సమస్యను పరిష్కరించగల చిన్న సెట్టింగ్‌ని మారిస్తే సరిపోతుంది.

ఫోన్ పూర్తి నిల్వ కారణంగా ఫోన్‌లో సమస్యలు తలెత్తుతుంటాయి. ఇది నేరుగా ఫోన్ పనితీరును ప్రభావితం చేస్తుంది. ఫోన్‌ను వాడేటప్పుడు తరచుగా హ్యాంగ్ అవుతుంటుంది. అలాంటి సమయంలో ఎవరికైనా చికాకు అనిపించడం సర్వసాధారణం. వాట్సాప్ యూజర్ల మదిలో మెదులుతున్న ప్రశ్న ఒక్కటే ఫోన్ లో ఫోటోలు, వీడియోలు సేవ్ కాకుండా ఆపడం ఎలా?

వాట్సాప్ వినియోగదారులు ఫోన్‌లో ఫోటోలు, వీడియోలు సేవ్ కాకుండా రెండు మార్గాల్లో నిరోధించవచ్చు. అన్నింటిలో మొదటిది, మీరు దీన్ని అన్ని చాట్‌లకు చేయాలనుకుంటున్నారా లేదా కేవలం ఒక చాట్‌కి చేయాలనుకుంటున్నారా అని మీరు ఆలోచించాలి. ఎందుకంటే మీకు WhatsApp లోనే రెండు ఆప్షన్లు లభిస్తాయి.

మీరు ఫోన్‌లో ఏ ఫోటో-వీడియోను సేవ్ చేయకూడదనుకుంటే ముందుగా WhatsAppను ఓపెన్ చేయండి. ఆపై కుడివైపు ఎగువన కనిపించే మూడు చుక్కలపై క్లిక్ చేసి, సెట్టింగ్‌లపై నొక్కండి. దీని తర్వాత చాట్స్‌పై క్లిక్ చేసి, మీడియా విజిబిలిటీ ఎంపికను ఆఫ్ చేయండి.

మీరు ఏదైనా ఒక చాట్ కోసం ఈ సెట్టింగ్‌ని ఆఫ్ చేయాలనుకుంటే, ఆ చాట్‌ని ఓపెన్ చేయండి. చాట్‌ని ఓపెన్ చేసిన తర్వాత కుడివైపు ఎగువన కనిపించే మూడు చుక్కలపై క్లిక్ చేసి వ్యూ కాంటాక్ట్‌పై నొక్కండి. దీని తర్వాత మీడియా విజిబిలిటీ ఎంపికను ఆఫ్ చేయండి.




