- Telugu News Photo Gallery Technology photos Buy OnePlus 5T at a discount price of 9,499 from it's original MRP of 39,999 on Amazon, know offer details Telugu Tech News
OnePlus 5T: రూ. 40 వేల ఫోన్‌ను రూ. 9వేలకే సొంతం చేసుకునే అవకాశం.. ఫీచర్స్ తెలిస్తే దిమ్మతిరగాల్సిందే.
ఆన్‌లైన్ షాపింగ్ సైట్స్‌లో ఫోన్‌లు కొనుగోలు చేసే సమయంలో పాత ఫోన్‌లను ఎక్స్ఛేంజ్ అడుగుతుంటారు గమనించారా.? మరి ఈ పాత ఫోన్‌లను ఏం చేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా.? ఇలా సేకరించిన ఫోన్‌లను కంపెనీలు కొత్తగా మార్చి మళ్లీ విక్రయిస్తుంటాయి. ఇలాంటి ఫోన్‌లను రీఫర్బిష్‌డ్ ఫోన్స్ అంటారు. ఆన్‌లైన్ సైట్స్ ఇలాంటి ఫోన్స్‌ను తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. అమెజాన్‌లో ఇలాంటి ఓ ఫోన్‌ను అందుబాటులో ఉంది. ఇంతకీ ఏంటా ఫోన్.? ధర ఎంత.? ఓ లుక్కేయండి..
Updated on: Aug 14, 2023 | 5:10 PM

ప్రముఖ ఈ కామర్స్ సైట్ అమెజాన్‌లో వన్‌ప్లస్ 5టీ స్మార్ట్ ఫోన్‌ను రీఫర్బిష్‌డ్ సెగ్‌మెంట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. 6జీబీ ర్యామ్, 64 జీబీ ర్యామ్ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 39,999కాగా అమెజాన్‌లో రూ. 9,499కి అందిస్తున్నారు. ఈ ఫోన్‌పై ఏకంగా రూ. 76 శాతం డిస్కౌంట్ లభిస్తోంది.

ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.01 ఇంచెస్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 1080పీ రిజల్యూషన్ ఈ స్క్రీన్ సొంతం.

ఈ స్మార్ట్ ఫోన్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 3300 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్‌ను ఇచ్చారు. డ్యూయల్ సిమ్ సపోర్ట్ చేస్తుంది.

కెమెరా విషయానికొస్తే ఇందులో 20 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాను అందించారు. డ్యూయల్ ఎల్‌ఈడీ ఫ్లాష్ ఈ కెమెరా ప్రత్యేకత. అలాగే సెల్ఫీల కోసం ఇందులో 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.

ఇక ఈ స్మార్ట్ ఫోన్ 156.1 ఎమ్‌ఎమ్ హైట్, 75 ఎమ్‌ఎమ్ విడ్త్, 7.3 ఎమ్‌ఎమ్ థిక్‌నెస్, 162 గ్రామ్స్ బరువు ఉంది. 128 జీబీ ఇంటర్నల్ మెమోరీని ఇచ్చారు.





























