- Telugu News Photo Gallery Technology photos Realme launching new smartphone Realme 11 5g price and features
Realme 11 5G: బడ్జెట్ ధరలో అదిరిపోయే స్మార్ట్ ఫోన్.. 108 ఎంపీ కెమెరాతో పాటు మరెన్నో సూపర్ ఫీచర్స్
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మీ ఇటీవల బడ్జెట్ ఫోన్‌లను లాంచ్ చేస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ ఫోన్స్‌ను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. రియల్‌మీ 11 5జీ స్మార్ట్ ఫోన్ పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌లో ఏకంగా 200 మెగాపిక్సెల్ కెమెరాను అందించడం విశేషం. దీంతో పాటు మరెన్నో సూపర్ ఫీచర్స్‌ను ఈ ఫోన్‌లో అందించారు. ఇంతకీ ఈ ఫోన్ ధర ఎంత.? ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
Narender Vaitla | Edited By: Ravi Kiran
Updated on: Aug 15, 2023 | 4:23 PM

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మీ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. రియల్‌మీ 11 పేరుతో లాంచ్ చేసిన ఈ 5జీ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం చైనాలో అందుబాటులో ఉంది. అయితే త్వరలోనే భారత మార్కెట్లోకి తీసుకురానున్నారు. ఈ ఫోన్ ధర విషయానికొస్తే చైనాలో 8జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ధర రూ. 18,000, 12 జీబీ ర్యామ్, 256 జీబీ ధర రూ. 20,600గా ఉంది. ఇక ఇండియా విషయానికొస్తే రూ. 20,000లోపు ఉండే అవకాశం ఉంది.

ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 2400 x 1080 పిక్సెల్‌తో కూడిన 6.72 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ఫుల్ హెచ్‌డీ+ స్క్రీన్‌ను అందించారు. 120Hz రిఫ్రెష్ రేట్ ఈ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ ప్రత్యేకత.

6ఎన్‌ఎమ్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ స్మా్ర్ట్ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఇచ్చారు.

రియల్‌మీ 11 5జీ స్మార్ట్ ఫోన్‌లో కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఏకంగా 108 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఇక సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్‌తో కూడిన సెల్ఫీ కెమెరాను అందించారు.

ఇక బ్యాటరీ విషయానికొస్తే.. ఇందులో 500 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. 67 వాట్స్ వైర్డ్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను అందించారు. 47 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్ పూర్తి అవుతుంది. ఇక సున్నా నుంచి 50 శాతం కేవలం 17 నిమిషాల్లోనే అవుతుంది.





























