- Telugu News Photo Gallery Technology photos Best Battery phones in low price here the some of best phones
Best Smartphone: మంచి చార్జింగ్ వచ్చే ఫోన్‌కోసం చూస్తున్నారా.? అయితే తక్కువ ధరలో ఉన్న బెస్ట్ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
Best Smartphone: సహజంగా స్మార్ట్ ఫోన్‌లు ఉపయోగించే వారు ఎదుర్కొనే సమస్యల్లో చార్జింగ్ ప్రధానమైంది. అయితే మార్కెట్లో 6000 ఎమ్‌ఏహెచ్ వంటి శక్తివంతమైన బ్యాటరీతో ఉన్న కొన్ని బడ్జెట్ ఫోన్‌లపై ఓ లుక్కేయండి..
Updated on: Oct 25, 2021 | 6:48 AM

స్మార్ట్ ఫోన్ ఉపయోగించే వారికి ప్రధాన శత్రువు చార్జింగ్. చాలా వరకు స్మార్ట్‌ఫోన్‌లు తక్కువ చార్జింగ్ ఇస్తుంటాయి. అయితే 6000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీతో ఎక్కువ సేపు చార్జింగ్ ఇచ్చే కొన్ని స్మార్ట్ ఫోన్‌ల వివరాలు మీకోసం..

GIONEE Max Pro: రూ. 7,299కే అందుబాటులో ఉన్న ఈ ఫోన్‌లో 6000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. ఇక 6.53 ఇంచెస్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే అందిచంని ఈ ఫోన్‌లో 13 మెగా పిక్సెల్ రెయిర్ కెమరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు.

Infinix Hot 10 Play: 6000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఉన్న మరో బడ్జెట్ ఫోన్ ఇది. ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 8,299కి అందుబాటులో ఉంది. ఇందులో 13 మెగా పిక్సెల్ రెయిర్ కెమరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు.

Samsung Galaxy F12: బ్యాటరీకి అధికా ప్రాధాన్యత ఇచ్చిన ఈ మొబైల్‌లో 6000 mAh బ్యాటరీని అందించారు. ఈ ఫోన్ ధర రూ. 10,299గా ఉంది. ఇందులో ప్రైమరీ కెమెరా 48 మెగాపిక్సెల్స్, సెల్ఫీ కెమెరా 8 మెగాపిక్సెల్ అందించారు.

POCO M3: చైనాకు చెందిన స్మార్ట్ తయారీ కంపెనీ పోకో 6000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీతో అందించిన స్మార్ట్ ఫోన్ ఇది. ఈ ఫోన్ రూ. 11,999కి అందుబాటులో ఉంది. 6.53 అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే ఉన్న ఈ ఫోన్‌లో 48 మెగాపిక్సెల్స్ రెయిర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు.




