- Telugu News Photo Gallery Technology photos Amazon offering huge discounts on Oneplus watch 2 watch, Click here for full details
Oneplus watch 2: వన్‌ప్లస్ వాచ్2పై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ. 6 వేలు తగ్గింపు..
ప్రస్తుతం స్మార్ట్ వాచ్‌లకు భారీగా డిమాండ్ పెరిగింది. దీంతో దాదాపు అన్ని టెక్ దిగ్గజాలు స్మార్ట్‌వాచ్‌లను లాంచ్ చేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం వన్‌ప్లస్ సైతం ప్రీమియం స్మార్ట్ వాచ్‌లను లాంచ్ చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే వన్‌ప్లస్ వాచ్ 2 పేరుతో ఓ వాచ్‌ను తీసుకొచ్చింది. ఈ వాచ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Jul 08, 2024 | 10:36 AM

వన్‌ప్లస్ గత కొన్ని నెలల క్రితం తీసుకొచ్చిన వన్‌ప్లస్ వాచ్2పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ప్రీమియం మార్కెట్‌ను టార్గెట్‌ను తీసుకొచ్చిన ఈ వాచ్‌పై అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఇంతకీ వాచ్‌పై ఎంత డిస్కౌంట్ లభిస్తోంది.? ఫీచర్లు ఏంటి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

వన్‌ప్లస్ వాచ్2 అసలు ధర రూ. 27,999కాగా ప్రస్తుతం 14 శాతం డిస్కౌంట్‌తో రూ. 23,999కి లభిస్తోంది. దీంతో అమెజాన్ పే బ్యాలెన్స్‌తో పే చేస్తే రూ. 719 వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. అలాగే పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 2000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఇలా వాచ్‌పై గరిష్టంగా రూ. 6 వేల వరకు డిస్కౌంట్ పొందొచ్చు.

ఇక వన్‌ప్లస్ వాచ్ 2 ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 1.43 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 600 నిట్స్ పీక్ బ్రైట్‌నెట్ ఈ వాచ్ స్క్రీన్ సొంతం. ఈ వాచ్‌లో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ ఫీచర్‌ను అందించారు.

ఈ వాచ్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 గంటల బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. పవర్ సేవర్ మోడ్‌ను ఇందులో ప్రత్యేకంగా ఇచ్చారు. వూక్ ఫాస్ట్ చార్జింగ్‌తో తీసుకొచ్చిన ఈ వాచ్ 60 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది.

ఈ వాచ్‌లో 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌ను అందించారు. వియర్ ఓస్4 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. స్లీప్ ట్రాకింగ్, స్ట్రెస్ మానిటరింగ్, హార్ట్ రేట్ మానిటరింగ్ వంటి హెల్త్ ఫీచర్లను అందించారు.




