- Telugu News Photo Gallery Technology photos 5G phones that are rising in the tens of thousand, with attracting features, Smart Phones Under 10K
Smart Phones Under 10K: పది వేలల్లో టాప్ రేపుతున్న 5 జీ ఫోన్లు.. ఫీచర్ల విషయంలో తగ్గేదేలే..!
భారతదేశంలోని ఎక్కువ మంది ప్రజలు మధ్యతరగతికి చెందిన వారే. ఈ నేపథ్యంలో వారు ఫోన్లు వాడాలంటే కచ్చితంగా వారికి అనుగుణంగా ఉండే బడ్జెట్ ఫోన్స్‌ను ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి మార్కెట్ రూ.10 వేల లోపు ధరతో ఉండే స్మార్ట్ ఫోన్లకు గిరాకీ పెరిగింది. కాబట్టి సూపర్ ఫీచర్స్‌తో పది వేల రూపాయల కంటే తక్కువ ధరలో అందుబాటులో ఉండే ఫోన్ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
Updated on: Jan 22, 2025 | 4:57 PM

మోటో కంపెనీ రిలీజ్ చేసిన జీ 35 5జీ ఫోన్ కూడా ఇటీవల కాలంలో ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. లెదర్ ఫినిషింగ్ సెగ్మెంట్‌లో ప్రీమియంగా కనిపించే ఈ ఫోన్‌ను మధ్య తరగతి యువత ఎంతగానో ఇష్టపడుతున్నారు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే వంటి దాని ఫీచర్‌లతో ఈ ఫోన్ ఆకట్టుకుంటుంది.

రెడ్ మీ 13 సీ 5జీ కూడా ఇటీవల యువత ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఎస్ఏ, ఎన్ఎస్ఏ 5జీ నెట్‌వర్క్‌లకు ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ కేవలం 90 హెచ్‌జెడ్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ స్క్రీన్‌తో ఆకట్టుకుంటుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ ఎస్ఓసీ ద్వారా ఈ ఫోన్ శక్తిని పొందుతుంది. అలాగే ఈ ఫోన్ 4 జీబీ + 128 జీబీ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది.

రూ.8499 ధరలో ఎంఐ కంపెనీ రిలీజ్ చేసి రెడ్ మీ ఏ4 5జీ మార్కెట్‌లో అత్యంత సరసమైన 5 జీ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటిగా ఉంది. అయితే ఈ ఫోన్ స్వతంత్ర (ఎస్ఏ) 5జీ నెట్‌వర్క్‌కు మాత్రమే మద్దతు ఇస్తుంది. అందువల్ల ఈ స్మార్ట్‌ఫోన్‌లో కేవలం జియో 5జీ నెట్‌వర్క్ ద్వారా మాత్రమే సేవలను పొందవచ్చు.

ప్రముఖ కంపెనీ సామ్‌సంగ్‌కు చెందిన గెలాక్సీ ఏ14 5జీ ఫోన్స్ రూ.10 వేల కంటే తక్కువ ధరలో అందుబాటులో ఉంటుంది. తక్కువ ధరలో సామ్‌సంగ్ అందిస్తున్న బెస్ట్ 5జీ ఫోన్స్‌లో ఇది ఒకటి. ఈ ఫోన్‌లో వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. అలాగే ఆండ్రాయిడ్ వన్ యూఐ 6తో రన్ అవుతుంది.

పోకో ఎం6 5జీ ఫోన్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌గా ఉంటుంది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఎస్ఏ, ఎన్ఎస్ఏ 5 జీ నెట్‌వర్క్‌లకు మద్దతు ఇవ్వడం ఈ ఫోన్ ప్రత్యేకతగా ఉంటుంది.




