- Telugu News Photo Gallery Technology photos 10000 rupees discount on OnePlus Y1 80 cm have a look on features
Smart TV: ఏమన్నా ఆఫరా అసలు.. రూ.10 వేలకే 32 ఇంచెస్ స్మార్ట్ టీవీ.. అది కూడా వన్‌ప్లస్ బ్రాండ్.
ప్రముఖ టెక్నాలజీ సంస్థ వన్‌ప్లస్ అదిరిపోయే ఆఫర్‌ను అందించారు. వన్‌ప్లస్ 32 ఇంచెస్ టీవీపై ఏకంగా రూ. 10 వేలకి పైగా డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ఈ టీవీకి సంబంధించి ఫీచర్లు, ధరకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
Updated on: Apr 15, 2023 | 8:53 PM

ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం వన్‌ప్లస్ స్మార్ట్ టీవీపై ఊహించని ఆఫర్‌ను అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ వై1 32 ఇంచెస్ టీవీపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది.

వన్‌ప్లస్ వై1 32 ఇంచెస్ స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 19,999 కాగా 40 శాతం డిస్కౌంట్‌లో రూ. 11,999కి అందుబాటులో ఉంది. అయితే పలు బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసే వారికి రూ. 1500 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఇలా మొత్తానికి టీవీని రూ. 10వేలకే సొంతం చేసుకోవచ్చు.

ఇక ఈ టీవీ ఫీచర్ల విషయానికొస్తే.. నెట్‌ఫ్లిక్స్ , ప్రైమ్ వీడియో, హాట్ స్టార్ డిస్నీ, యూట్యూబ్ యాప్స్‌ను చూడొచ్చు. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే టీవీలో క్రోమ్ కాస్ట్ బిల్ట్ ఇన్, గూగుల్ అసిస్టెంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

సౌండ్ విషయానికొస్తే 20 వాట్ సౌండ్ ఔట్‌పుట్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు వంటి ఫీచర్స్ అందించారు. బెజిల్ లెస్ డిజైన్‌తో రూపొందించిన ఈ టీవీ లుక్ విషయంలో సూపర్‌గా ఉంది.

10 రోజుల రిప్లేస్‌మెంట్ తో ఈ టీవీని అందిస్తున్నారు. అంతేకాకుండా ఇందులో 2 హెచ్‌డీఎంఐ పోర్టులు, 2 యూఎస్‌బీ పోర్టులు అందించారు. స్క్రీన్ విషయానికొస్తే ఇందులో హెచ్‌డీ రడీ 1366*768 పిక్సెల్స్ అందించారు.





























