- Telugu News Photo Gallery Technology photos Youtube offering new features for premium subscribers Telugu Tech News
YouTube: యూట్యూబ్‌లో సూపర్ ఫీచర్స్.. అయితే ఈ అవకాశం వారికి మాత్రమే.
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ యాప్ యూట్యూబ్ యూజర్ల కోసం కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. అయితే ఈ కొత్త ఫీచర్లు కేవలం ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఉన్న వారి కోసం మాత్రమే. ఇంతకీ యూట్యూబ్ తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్లు ఏంటి.? వాటి ఉపయోగం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Apr 16, 2023 | 11:17 AM

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ యూట్యూబ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ఆదారణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక యూట్యూబ్ యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని ఫీచర్లను తీసుకొచ్చింది. అయితే ఈ ఫీచర్లు కేవలం యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నవారికి మాత్రమే.

యూట్యూబ్ తీసుకొచ్చిన ఫీచర్లలో క్యూ ఫీచర్ ఒకటి. ఈ ఫీచర్‌తో మీరు వీడియో చూస్తున్నప్పుడు తర్వాత ఏ వీడియోను ప్లే చేయాలో నిర్ణయించుకోవడానికి, వాటిని సెలెక్ట్ చేసుకోవడానికి మీకు ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. యూట్యూబ్ ప్రీమియం వినియోగదారుల కోసం ఈ ఆప్షన్ మొబైల్‌లో కూడా అందుబాటులోకి రానుంది.

Youtube

ప్రీమియం సభ్యుల కోసం యూట్యూబ్ త్వరలోనే 1080p HD వీడియో నాణ్యతతో మెరుగైన బిట్‌రేట్ వెర్షన్‌ను విడుదల చేయనుంది. 1080p నాణ్యత ప్రీమియం సభ్యులకు మాత్రమే ప్రత్యేకంగా అందించనున్నారు.

యూట్యూబ్ ప్రీమియం సభ్యులు గూగుల్ మీట్ సెషన్లను కూడా హోస్ట్ చేయొచ్చు. ఇందులో ప్రీమియం సభ్యులతో పాటు ఇతర సభ్యులు ఉచితంగానే YouTube వీడియోలను కలిసి చూడొచ్చు.





























