- Telugu News Photo Gallery Taking chia seeds like this will increase hair growth, Check Here is Details
Chia Seeds for Hair: చియా సీడ్స్ ఇలా తీసుకుంటే వద్దన్నా జుట్టు పెరుగుతుంది..
గింజల్లో చియా సీడ్స్ కూడా ఒకటి. ప్రతి రోజూ ఒక స్పూన్ చియా సీడ్స్ తీసుకున్నా ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిని తినడం వల్ల శరీరం, చర్మానికే కాకుండా జుట్టు ఆరోగ్యంగా ఉండటం కోసం కూడా ఎంతో సహాయ పడతాయి..
Updated on: Jan 17, 2025 | 2:32 PM

చియా సీడ్స్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈ మధ్య కాలంలో చాలా మంది వీటిని ఉపయోగిస్తున్నారు. చియా సీడ్స్‌ని నీటిలో నానబెట్టి ఎందులో అయినా యూజ్ చేసి తీసుకోవచ్చు. జ్యూసులు, స్మూతీలు, సలాడ్స్ ఇలా వేటితో అయినా తినవచ్చు.

chia seeds

హెయిర్ ఫాల్ సమస్య ఉన్నవారు ప్రతి రోజూ ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్, జింక్, ఇనుము ఉన్న ఆహారాలను తీసుకోవాలి. ఇవన్నీ చియా సీడ్స్‌లో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజూ చియా సీడ్స్ తీసుకుంటే హెయిర్ ఫాల్ సమస్య కంట్రోల్ అవుతుంది.

చియా సీడ్స్ తీసుకుంటే.. తలపై ఉన్న ఇన్‌ఫ్లమేషన్ సమస్యను కంట్రోల్ చేస్తుంది. మాడును హైడ్రేట్‌గా ఉంచుతుంది. జుట్టు మూలాలకు పోషణ అందిస్తుంది. రక్త ప్రసరణను కూడా మెరుగు పరుస్తుంది.

చియా సీడ్స్‌ని మీరు ఎలాగైనా తీసుకోవచ్చు. నీటిలో నానబెట్టి నిమ్మరసం పిండి తీసుకోవచ్చు. నేరుగా నీటితో కలిపి తాగవచ్చు. పెరుగుపై చల్లి.. తీసుకోవచ్చు. ఫ్రూట్స్‌పై చల్లి కూడా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్న పోషకాలు చక్కగా అందుతాయి. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)




