- Telugu News Photo Gallery Sweat comes when eating spicy food but does not come when eating sweet do you know the reason
Knowledge: స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు చెమట వస్తుంది కానీ స్వీట్ తిన్నప్పుడు రాదు.. కారణం ఏంటో తెలుసా..?
Knowledge: చాలా మంది యువత స్పైసీ ఫుడ్‌ను ఇష్టపడతారు. దేశంలో చైనీస్ ఫుడ్ ట్రెండ్ పెరగడానికి ఇదే కారణం. చైనీస్ ఫుడ్ లేదా స్పైసీ ఫుడ్ తినేటప్పుడు ముఖంపై చెమట ఎక్కువగా వస్తుంది.
Updated on: May 18, 2022 | 11:55 AM

చాలా మంది యువత స్పైసీ ఫుడ్‌ను ఇష్టపడతారు. దేశంలో చైనీస్ ఫుడ్ ట్రెండ్ పెరగడానికి ఇదే కారణం. చైనీస్ ఫుడ్ లేదా స్పైసీ ఫుడ్ తినేటప్పుడు ముఖంపై చెమట ఎక్కువగా వస్తుంది. కానీ స్వీట్ తిన్నప్పుడు రాదు. దీనికి కారణం ఏంటో తెలుసా..

ఒక వ్యక్తి మిరపకాయ తిన్నప్పుడు శరీర ఉష్ణోగ్రత పెరగడం ప్రారంభమవుతుంది. ఎందుకంటే మిరపకాయలో క్యాప్సైసిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది నాలుకకు చేరిన వెంటనే ప్రతిచర్య ప్రారంభమవుతుంది. దీని కారణంగా శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది.

శరీరంలో చెమట గ్రంథులు ఉంటాయి. వాటి పని శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడం. ఒక వ్యక్తి స్పైసీ ఫుడ్ తిన్నప్పుడల్లా క్యాప్సైసిన్ కారణంగా వేడి పదార్థాలను తింటున్నట్లు మెదడుకు అనిపిస్తుంది. అప్పుడు మెదడు ఆదేశాల మేరకు చర్మం చెమటని బయటిక పంపుతుంది. తద్వారా శరీరం చల్లగా ఉంటుంది.

స్పైసీ ఫుడ్ తిన్న తర్వాత శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. అప్పుడు మెదడులోని అతి ముఖ్యమైన భాగం హైపోథాలమస్ ప్రతిస్పందిస్తుంది. అందువల్ల ఒక వ్యక్తి ఎప్పుడైతే మసాలా, కారం తిన్నాడో అప్పుడు చెమటలు విపరీతంగా వస్తాయి. ఆ ఆహారం వేడిగా ఉంటే చెమట పట్టడం మరింత పెరుగుతుంది.

వేడి ప్రదేశాలలో నివసించే ప్రజలు వేడి ప్రభావాన్ని తగ్గించడానికి మసాలా ఆహారాన్ని తింటారు. ఇలా చేయడం వల్ల శరీరం చెమటలు పట్టి చల్లగా ఉంటుంది.



