- Telugu News Photo Gallery Sports photos Wtc final all you need to know about team india and new zealand the rose bowl southampton pitch record in telugu
India tour of England: సౌతాంప్టన్‌లో జరిగే డబ్ల్యుటిసి ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాకు ఉన్న విజయావకాశాలు… గత రికార్డులు.. ఎలా ఉన్నాయంటే…
wtc final: సౌతాంప్టన్ స్టేడియంలో టీమిండియా రికార్డు ఇబ్బందికరంగా ఉన్నాయి. న్యూజిలాండ్‌కు ఇది పెద్ద ప్లస్ పాయింట్‌గా మారనుంది. అయితే ఇక్కడ ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో టీమిండియా గెలవలేదు.
Updated on: May 18, 2021 | 5:43 PM

డబ్ల్యుటిసి ఫైనల్ మ్యాచ్ సౌతాంప్టన్‌లోని అగాస్ బౌల్ స్టేడియంలో జరుగుతుంది. ఈ స్టేడియంలో 25,000 మంది సామర్థ్యం ఉంది. ఇప్పటి వరకు ఈ స్టేడియంలో మొత్తం 6 టెస్ట్ మ్యాచ్‌లు భారతదేశం, న్యూజిలాండ్‌ల మధ్య జరిగాయి. ఈ మైదానంలో మొదటి టెస్ట్ 16 జూన్ 2011న ఇంగ్లాండ్ మరియు శ్రీలంక మధ్య జరిగింది.

ఈ స్టేడియంలో ఇంగ్లాండ్ చేసిన స్కోర్ పెద్దది. 2020లో పాకిస్తాన్‌తో జరిగిన తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 583 పరుగులు చేసింది ఇంగ్లాండ్. అయితే ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది.

అయితే ఈ స్టేడియంలో అత్యల్ప స్కోరును నమోదు చేసిన రికార్డు మాత్రం టీమిండియా పేరుతో ఉంది. 2014 లో ఇంగ్లాండ్‌లో జరిగిన రెండవ ఇన్నింగ్స్‌లో కేవలం 178 పరుగులకే ఆలౌట్ ధోనీ సేన. ఈ మ్యాచ్‌ను ఇంగ్లాండ్ 266 పరుగుల తేడాతో గెలుచుకుంది.

ఈ స్టేడియంలో అత్యధిక వ్యక్తిగత స్కోరు మాత్రం ఇంగ్లాండ్ బ్యాట్స్ మాన్ జాక్ క్రౌలీ పేరుతో ఉంది. 2020 లో పాకిస్థాన్‌పై 267 పరుగులు చేశాడు. ఇందులో 34 ఫోర్లు, 1 సిక్సర్లు ఉన్నాయి. ఈ సమయంలో అతను 393 బంతులు ఆడాడు.

సౌతాంప్టన్‌లో ఉత్తమ బౌలింగ్ రికార్డులను క్రియేట్ చేసింది మాత్రం వెస్ట్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్ జాసన్ హోల్డర్. జూలై 2020లో ఇంగ్లాండ్‌తో ఆడిన టెస్టులో 42 పరుగులకు 6 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌ను వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌పై గెలిచింది.

సౌతాంప్టన్‌లో టీమిండియా రికార్డులు అద్భుతంగా లేవు. విరాట్ కోహ్లీ జట్టు గతంలో ఇక్కడ 2 మ్యాచ్‌లు ఆడింది. అయితే ఈ రెండు మ్యాచులు ఓడిపోయింది. అదే సమయంలో న్యూజిలాండ్ ఇంతవరకు ఈ స్టేడియంలో అడిన రికార్డు లేదు.





























