నాలుగో టీ 20 మ్యాచ్‌లో భారత్ 8 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి సిరీస్‌లో 2–2తో సమం చేసింది. ఈ మ్యాచ్ చివరి బంతి వరకు కొనసాగింది, ప్రేక్షకులకు థ్రిల్ కలిగించింది . చివరి క్షణం వరకు మైదానంలో వారి సామర్థ్యాన్ని చూపించడానికి ఆటగాళ్లకు అవకాశం దక్కింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు మంచి ప్రదర్శన కనబరిచారు. అయితే, రెండుసార్లు అంపైర్లు తీసుకున్న నిర్ణయం వల్ల టీమిండియా నష్టాలను చవిచూసింది, ఈ అంశంపై చర్చకు దారితీసింది.