- Telugu News Photo Gallery Sports photos Road safety world series sachin tendulkar and yuvraj singh play for india legends yuvraj hits four sixes in over sachin scores a fifty
Road Safety World Series: సచిన్ టెండూల్కర్‌కు ఇది స్పెషల్ డే.. తన లాస్ట్ వన్డేలో ఎన్ని రన్స్ చేశాడో తెలుసా.?
క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కు ఇది చాలా ప్రత్యేకమైన రోజు. ఈరోజున తన చివరి వన్డే మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్ లో సచిన్ ఎన్ని పరుగులు చేసాడో తెలుసా.!
Updated on: Mar 18, 2021 | 8:19 PM

క్రికెట్ గాడ్‌గా పిలువబడే సచిన్ టెండూల్కర్ తన 24 సంవత్సరాల అంతర్జాతీయ కెరీర్‌లో ఎన్నో అద్భుత రికార్డులను సృష్టించాడు. ఈ రోజు సచిన్ కెరీర్‌లో ఒక ప్రత్యేక రోజు

18 మార్చి 2012న సచిన్ టెండూల్కర్ తన క్రికెట్ కెరీర్‌లో చివరి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఆడాడు. ఆ సంవత్సరం ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో తన లాస్ట్ మ్యాచ్ ఆడాడు. ఇక సచిన్ తన మొదటి మ్యాచ్‌ను సైతం 1989లో పాకిస్థాన్‌తోనే ఆడాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు నిర్ణీత ఓవర్లకు 6 వికెట్లకు నష్టపోయి 329 పరుగులు చేసింది. దీని తరువాత సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీతో కలిసి 132 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పి భారత్‌ను పటిష్ట స్థితికి చేర్చాడు.

సచిన్ టెండూల్కర్ తన చివరి ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీ కొట్టాడు. 48 బంతుల్లో 52 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, ఒక సిక్స్ ఉంది. సచిన్ ఇన్నింగ్స్ టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించింది.

సచిన్ టెండూల్కర్ వన్డేల్లో 463 మ్యాచ్‌లు ఆడాడు, ఇది ఒక రికార్డు. ఇక అతడి ఖాతాలో 18,426 పరుగులు ఉండగా.. అందులో 49 సెంచరీలు, 96 అర్ధ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో సచిన్ సాధించిన వ్యక్తిగత స్కోర్ 200 నాటౌట్.

సచిన్, యువరాజ్ తాజాగా జరిగిన ఇండియా లెజెండ్స్, వెస్టిండిస్ లెజెండ్స్ మ్యాచ్‌లో అదరగొట్టారు. యువరాజ్ ఒకే ఓవర్‌లో నాలుగు సిక్సర్లు బాదగా.. సచిన్ తన ఇన్నింగ్స్‌లో మూడు సిక్సర్లు కొట్టాడు.




