Spinner Radha Yadav: క్రికెట్ చరిత్రలో అద్భుత రికార్డు ఆమె సొంతం.. ఇంతకీ ఎవరామె.! ఆ ఘనత ఏంటి.?
దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్ ఉమెన్స్ జట్టు 4–1 తేడాతో సిరీస్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సిరీస్‌లో యువ స్పిన్నర్ రాధా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.
టీ20 క్రికెట్‌లో రాధా యాదవ్ 50 వికెట్లు పడగొట్టగా.. అతి చిన్న వయస్కురాలిగా ఆమె ఈ ఘనత సాధించింది. రాధా 36 టీ20 మ్యాచ్‌లు ఆడి 50 వికెట్లు పడగొట్టింది.
1 / 4
అతి పిన్న వయస్కురాలిగా 50 టీ20 వికెట్లు తీసిన రికార్డు బంగ్లాదేశ్‌కు చెందిన నహిదా అక్తర్ పేరిట ఉంది. నహిదా సరిగ్గా 20 సంవత్సరాల వయస్సులో ఈ ఘనతను సాధించింది.
2 / 4
ఇంగ్లాండ్ ఎడమచేతి వాటం స్పిన్నర్ సోఫీ ఎక్లెస్టోన్ ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉంది. సోఫీ 20 సంవత్సరాల 300 రోజుల వయసులో ఈ రికార్డును అందుకుంది.
3 / 4
అదే సమయంలో భారత్ తరపున 50 టీ20 వికెట్లు తీసిన ఐదవ బౌలర్‌గా రాధా పేరుగాంచింది. టీమిండియాలో ఇప్పటిదాకా అత్యధికంగా 95 వికెట్లు స్పిన్నర్ పూనమ్ యాదవ్ తీయగా.. జులాన్ గోస్వామి (56), ఏక్తా బిష్ట్ (53), దీప్తి శర్మ (53) ఆ తర్వాత వరుసగా ఉన్నారు.