- Telugu News Photo Gallery Sports photos England batsman dawid malan scored the fastest 1000 runs in t20 cricket india vs england 5th t20i
India vs England 5th T20 Match: టీ20లో రికార్డు బద్దలు.. పాత చరిత్రను తిప్పేసిన డేవిడ్ మలన్
టీమిండియా (ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 5 వ టీ 20) తో జరిగిన ఐదవ టీ 20 మ్యాచ్‌లో డేవిడ్ మలన్ 68 పరుగులు చేశాడు. దీంతో సరికొత్త రికార్డు మలన్ ఖాతాలో చేరింది.
Updated on: Mar 21, 2021 | 8:18 PM

ఐదవ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను ఓడించిన టీమిండియా సిరీస్‌ను 3-2తో గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో డేవిడ్ మలన్ 68 పరుగులు చేశాడు. దీంతో టీ20 క్రికెట్‌లో అతి తక్కువ ఇన్నింగ్స్‌లో 1000 పరుగులు చేసిన వేగవంతమైన బ్యాట్స్‌మన్‌గా మలన్ రికార్డ్ సృష్టించాడు. ఈ సందర్భంగా, ఇప్పటివరకు వేగంగా 1000 పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ గురించి తెలుసుకోబోతున్నాం.

డేవిడ్ మలన్.. టీ20లో మలన్ నంబర్ వన్ బ్యాట్స్ మాన్‌గా కొనసాగుతున్నాడు. టీమిండియాతో జరిగిన ఐదవ మ్యాచ్‌లో మలన్ 46 బంతుల్లో 68 పరుగులు చేశాడు. దీంతో మలన్ మొత్తం 24 మ్యాచ్‌ల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు.

మలన్ కంటే ముందు ఈ రికార్డును పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం పేరుతో ఉంది. బాబర్ 2018లో ఈ ఘనతను సాధించారు. బాబర్ 26 ఇన్నింగ్స్‌లలో వెయ్యి పరుగులు పూర్తి చేశాడు. తాజా గణాంకాల ప్రకారం, అజామ్ ఇప్పుడు 45 మ్యాచ్‌లలో 1,730 పరుగులు చేశాడు. ఇందులో 16 ఆఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

అంతకుముందు టీమిండియాకు చెందిన విరాట్ కోహ్లీ ఖాతాలో ఈ రికార్డు ఉంది. విరాట్ 27 ఇన్నింగ్స్‌లలోనే ఈ రికార్డును నెలకొల్పాడు. ఆ తరువాత బాబర్ ఈ రికార్డును బద్దలు కొట్టాడు. టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కోహ్లీ. విరాట్ కెప్టెన్‌గా టీ 20 లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు.

ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఫించ్ 29 ఇన్నింగ్స్‌లలో 1,000 పరుగుల మార్కును అధిగమించాడు. ఫించ్ దీన్ని 2017 లో చేశాడు. ఆస్ట్రేలియా నుంచి టీ 20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు ఫించ్. ఫించ్ 2,346 పరుగులు చేశాడు. అతను 2 సెంచరీలతోపాటు 14 అర్ధ సెంచరీలు చేశాడు.

కెఎల్ రాహుల్




