- Telugu News Photo Gallery Sports photos Prithvi Shaw celebrating his girl friend Model Akriti Agarwal in mumbai
గర్ల్ ఫ్రెండ్ బర్త్ డే గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన పృథ్వీ షా! పిక్స్ వైరల్
ఐపీఎల్ 2025 మెగా వేలంలో పృథ్వీ షా అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. అతని పేలవమైన ప్రదర్శన దీనికి కారణమని భావిస్తున్నారు. క్రికెట్‌కు దూరంగా ఉన్న ఈ సమయంలో, మోడల్ ఆకృతి అగర్వాల్ తో ప్రిథ్వీ షా డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇద్దరూ కలిసి కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
SN Pasha |
Updated on: May 02, 2025 | 4:16 PM

టీమిండియా వెటరన్ క్రికెటర్ పృథ్వీ షా గత కొన్ని రోజులుగా క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. ఐపీఎల్ 2025 కోసం జరిగిన మెగా వేలంలో పృథ్వీ షాను ఏ ఫ్రాంచైజ్ కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించలేదు. దీంతో.. పృథ్వీ షా అన్‌సోల్డ్‌గానే మిగిలిపోయాడు.

అతని తన బేస్ ప్రైజ్ కేవలం రూ.75 లక్షలే అయినా ఎవరు తీసుకోలేదు. గత కొన్ని సంవత్సరాలుగా అతని పేలవమైన ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటూ ఈ జట్టు కూడా అతన్ని తీసుకునేందుకు ముందుకు రాలేదు.

క్రికెట్ విషయం పక్కన పెడితే.. తాజాగా ఓ మోడల్‌తో పృథ్వీ షా డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆకృతి అగర్వాల్ అనే మోడల్‌తో పృథ్వీ షా పలు చోట్ల కూడా కలిసి కనిపించాడు. దీంతో ఇద్దరు లవ్‌లో ఉన్నట్లు నెటిజన్లు భావిస్తున్నారు.

తాజాగా ఆకృతి అగర్వాల్ బర్త్‌డే సందర్భంగా పృథ్వీ షా కేక్ తినిపిస్తూ కనిపించాడు. ఆకృతి 22వ పుట్టినరోజు సందర్భంగా పృథ్వీ షాతో కలిసి ఉన్న ఫొటోను ఆమెకు సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఆకృతి అగర్వాల్ 2 మే 2003న లక్నోలోని నవాబ్స్ నగరంలో జన్మించారు. ఆమె ఇప్పుడు ముంబైలో నివసిస్తోంది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 3.4 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇది కాకుండా, అకృతికి 70,000 కంటే ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్‌లు ఉన్న యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది.



















