Ravi Kiran |
Updated on: Apr 23, 2021 | 9:09 AM
ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ లో రెండు నో బాల్స్ వేసిన బుమ్రా.. ఐపీఎల్‌లో 25 నోబాల్స్ వేసిన బౌలర్‌గా చెత్త రికార్డు సొంతం చేసుకున్నాడు. మాజీ ఫాస్ట్ బౌలర్ ఎస్.శ్రీశాంత్ 8 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు.
ఈ జాబితాలో భారత మాజీ ఫాస్ట్ బౌలర్ ఎస్.శ్రీశాంత్ రెండో స్థానంలో ఉన్నాడు. రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల తరపున ఆడిన శ్రీశాంత్ 2008, 2013 సీజన్ల మధ్య 23 నోబాల్స్ వేశాడు.
మూడో స్థానంలో ఉన్న భారత ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ… ఇప్పటివరకు 21 నోబాల్స్ వేశాడు.
వెటరన్ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా ఈ జాబితాలో ఇషాంత్‌తో సమానంగా ఉన్నాడు. ఇప్పటివరకు 21 నోబాల్స్ వేశాడు.
ఉమేష్ యాదవ్ కూడా ఈ జాబితాలో ఒక భాగం. అతను ఈ లీగ్ చరిత్రలో ఇప్పటిదాకా 19 నోబాల్స్ వేశాడు.