Champions Trophy: గోల్డెన్ బాల్ సొంతం చేసుకునే బౌలర్ ఎవరు? రేసులో ఇద్దరు భారత బౌలర్లు
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ లో గోల్డెన్ బాల్ గెలుచుకునే అవకాశం ఉన్న టాప్ 4 బౌలర్ల గురించి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. మ్యాట్ హెన్రీ, మొహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, మిచెల్ సాంట్నర్ ఇందులో ఉన్నారు. ఫైనల్ మ్యాచ్ లో వీరిలో ఎవరు అత్యధిక వికెట్లు తీసి గోల్డెన్ బాల్ అందుకుంటారో చూడాలి.
Updated on: Mar 07, 2025 | 1:16 PM

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఈ నెల 9న భారత్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌తో ఛాంపియన్స్ ట్రోఫీ విన్నర్ ఎవరో తేలిపోనుంది. అలాగే పలు అవార్డులు కూడా ఎవరు గెలుచుకుంటారో తెలిసిపోతుంది. వాటిలో ముఖ్యంగా గోల్డెన్ బ్యాట్, గోల్డెన్ బాల్ ఉన్నాయి. గోల్డెన్ బ్యాట్ అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌కు, గోల్డెన్ బాల్ అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్‌కు అందజేస్తారు. మరి ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో గోల్డెన్ బాల్ అందుకునే ఛాన్స్ ఉన్న టాప్ 4 బౌలర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

ఈ లిస్ట్‌లో న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్నీ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. హెన్రీ ఇప్పటి వరకు 10 వికెట్లు తీసుకున్నాడు. ఫైనల్ మ్యాచ్‌లో మరిన్ని వికెట్లు తీసుకొని, గోల్డెన్ బాల్ అందుకోవాలనే కసితో ఉన్నాడు. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఒకసారి ఐదు వికెట్ల హాల్ కూడా సాధించాడు హెన్రీ. 16 యావరేజ్‌తో వికెట్లు తీస్తున్నాడు.

ఇక గోల్డెన్ బాల్ అందుకునే ఛాన్స్ ఉన్న టాప్ 2 ప్లేయర్ మన టీమిండియా స్టార్ బౌలర్ మొహమ్మద్ షమీ. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం రోజాను కూడా వదిలేసి ఆడుతున్న షమీ ఎలాగైనా గోల్డెన్ బాల్ అందుకోవాలని చూస్తున్నాడు. ఇప్పటి వరకు 8 వికెట్లు పడగొట్టిన షమీ, హెన్రీ దాటాలంటే మరో 3 వికెట్లు సాధించాలి. అవసరమైతే 3 కంటే ఎక్కువ వికెట్లు తీసుకుంటే షమీనే టాప్‌లో ఉంటాడు. బంగ్లాపై ఐదు వికెట్లు తీసిన షమీ, ఆస్ట్రేలియాపై 3 వికెట్లు సాధించాడు. ఈ టోర్నీలో ఒక మ్యాచ్‌లో ఐదు, ఒక మ్యాచ్‌లో మూడు వికెట్లు సాధించిన ఏకైక బౌలర్ షమీనే.

మూడో స్థానంలో టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఉన్నాడు. వరుణ్ ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడినా 7 వికెట్లతో సత్తా చాటాడు. న్యూజిలాండ్‌పై తొలి మ్యాచ్ ఆడి ఏకంగా 5 వికెట్ల హాల్ సాధించాడు. అలాగే ఆస్ట్రేలియాపై రెండు వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా 7 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్‌పై మరో 5 వికెట్ల హాల్ సాధిస్తే టాప్‌లోకి వచ్చి గోల్డెన్ బాల్ అందుకునే ఛాన్స్ ఉంది.

నాలుగో ప్లేస్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ ఉన్నాడు. ఇతను ఇప్పటి వరకు 7 వికెట్ల సాధించాడు. షమీ, హెన్రీని దాటి గోల్డెన్ బాల్ అందుకోవాలంటే సాంట్నర్ 5 వికెట్ల కంటే ఎక్కువ వికెట్లు తీయాల్సి ఉంటుంది.




