- Telugu News Photo Gallery Spiritual photos Yadadri temple sets new all time record in one day income at Rs 1.09 crore details Telugu spiritual Photos
Yadadri temple: ఆలయ చరిత్రలో ఇదే తొలిసారి .. ఆదివారం ఒక్కరోజే ఊహించని ఆదాయం.. ఎంతంటే..?
యాదాద్రి ఆలయానికి రికార్డు స్థాయి ఆదాయం వచ్చింది. ఆదివారం ఒక్కరోజే ఒక కోటి 9 లక్షల ఆదాయం వచ్చినట్లు చెప్పారు ఆలయ అధికారులు. యాదాద్రి చరిత్రలోనే తొలిసారి కోటి రూపాలయ ఆదాయం
Updated on: Nov 14, 2022 | 1:48 PM

యాదాద్రి ఆలయానికి రికార్డు స్థాయి ఆదాయం వచ్చింది. ఆదివారం ఒక్కరోజే ఒక కోటి 9 లక్షల ఆదాయం వచ్చినట్లు చెప్పారు ఆలయ అధికారులు.

యాదాద్రి చరిత్రలోనే తొలిసారి కోటి రూపాలయ ఆదాయం రావడం ఇదే తొలిసారి కావడం విశేషమని చెప్పారు అధికారులు. వరుస సెలవులు, కార్తీక మాసం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున వచ్చిన మొక్కులు చెల్లించుకున్నారని..

ఇదే క్రమంలో స్వామివారి హుండీ ఆదాయం పెరిగిందని ఆలయ అధికారులు తెలిపారు. ఒక్కరోజే రికార్డు స్థాయిలో రూ.1,09,82,000 ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు.

ఆదివారం యాదాద్రి లక్ష్మినరసింహస్వామి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. కొండ కింద నుంచి కొండపై వరకు భక్తుల రద్దీ నెలకొంది.

స్వామివారి ఉచిత దర్శనానికి దాదాపు 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు 3 గంటల సమయం పట్టింది. బ్రేక్ దర్శనానికి సైతం భక్తులు అధిక సంఖ్యలో వెళ్లారు. భక్తుల రద్దీతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి.

లడ్డు ప్రసాదం కౌంటర్లు, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కల్యాణ కట్ట ప్రాంతాల్లో భక్తుల సందడి నెలకొంది.

కార్తీక మాసం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించుకుని దీపారాధన చేసుకున్నారు.

కొండ కింద నుండి ఆర్టీసీ బస్సులు లేక కొందరు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాలినడకన కొండపైకి వెళ్లి.. స్వామివారిని దర్శించుకున్నారు. మరోవైపు కొండపైకి కారులో వెళ్లిన భక్తులు కూడా ఇబ్బందులు పడ్డారు.

తమ కార్లను పార్కింగ్ చేసేందుకు తగినంత స్థలం లేకపోవడంతో గంటల తరబడి వేచి ఉన్నారు. ట్రాఫిక్ నియంత్రణ, ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయడంలో అధికారులు వైఫల్యం చెందారంటూ భక్తులు ఆరోపించారు.

అయితే యద్రాద్రి లోని నైట్ లైట్ లో టెంపుల్ అత్యంత సుందరంగా ఆకట్టుకుంటుంది.

అయితే యద్రాద్రి లోని నైట్ లైట్ లో టెంపుల్ అత్యంత సుందరంగా ఆకట్టుకుంటుంది.
