- Telugu News Photo Gallery Spiritual photos Vaisakha amavasya 2021 date and time and significance and importance method of worship
Vaisakha Amavasya 2021: వైశాఖ అమావాస్య శుభ సమయం.. పూజా విధానం.. ఈరోజు ప్రాముఖ్యత ఎంటంటే..
హిందూ సంప్రదాయంలో అమావాస్యకు ప్రత్యేకత ఉంటుంది. అందులో వైశాఖ అమావాస్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈరోజున సూర్యుడిలో చంద్రుడు పూర్తిగా కలిసిపోతాడు. ఈరోజు మొత్తం చీకటిగా మారిపోతుంది. ఈరోజు అంటే మే 11న మంగళవారం వైశాఖ అమావాస్య. దీనిని భూమి అమావాస్య అని కూడా పిలుస్తారు. అలాగే వైశాఖ అమావాస్యను సత్వారీ అమావాస్య అంటారు.
Updated on: May 11, 2021 | 10:41 AM

శుభసమయం.. వైశాఖ అమావాస్య మే 10న ఉదయం 9.51 ప్రారంభమవుతుంది. అలాగే మే 11 ఉదయం 12.31 వరకు ఉంటుంది. శుభసమయం..అభిజిత్ ఉదయం 11.36 నుంచి మధ్యాహ్నం 12.29 వరకు ఉంటుంది. అలాగే అమృత కాలం 6.06am నుంచి 7.54am వరకు ఉంటుంది.

పురాణాల ప్రకారం గరుడ పురాణంలో విష్ణువు అమావాస్య రోజున మన పూర్వీకులు భూమి పైకి వస్తారని విశ్వసిస్తుంటారు. ఈరోజున వారిని ఆరాధించడం వలన వారీ ఆశీర్వాదం లభిస్తుందని పండితులు చెబుతుంటారు. అలాగే ఈరోజున పేదలకు దానధర్మాలు చేస్తే రెట్టింపు ప్రయోజనాలు దక్కుతాయట.

ఈరోజున ఉదయాన్నే నదిలో స్నానమాచరించి.. ఇంట్లో ఉన్న దేవుడి ముందు దీపం పెట్టాలి. ఆ తర్వాత సూర్యుడిని ప్రార్థించాలి. ఈరోజున గంగానది నీటిలో పీపాల్ చెట్టుకు నువ్వులను ఆర్పించాలి.

ఈరోజున బ్రహ్మణులు, పేదలకు విరాళాలు, ఆహారం, బట్టలు ధానం చేయాలి. అలాగే పక్షుల కోసం కొన్ని విత్తనాలు, మిల్లెట్ అందచేయాలి.

వైశాఖ అమావాస్య రోజున శని దేవుని ఆరాధన చేయాలి. అలాగే నువ్వులు, ఆవనూనేతో పూజించాలి.

ఈ పవిత్రమైన రోజు ఉపవాసం ఉంటే.. అనేక ప్రయోజనాలు చేకూరతాయని చాలా మంది నమ్మకం. ఈ రోజున ఉపవాసం ఉంటే.. మన పూర్వీకుల బాధతలను తీర్చడమే కాక.. రాహువు బలహీనత మరియు ఇతర సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని పండితులు చెబుతారు.

వైశాఖ అమావాస్య




