- Telugu News Photo Gallery Spiritual photos These are the zodiac signs that bring good luck with the conjunction of Mars and Venus
కుజ, శుక్రుల కలయిక… వీరి ఇంట సిరుల పంట!
శక్తివంతమైన గ్రహాల్లో కుజ, శుక్ర గ్రహాలు కూడా ఉన్నాయి. అయితే నెలలో కనీసం ఒక్కసారైనా గ్రహాలు సంచరించడం అనేది కామన్. అంతే కాకుండా కొన్నిసార్లు గ్రహాల కలియిక జరుగుతుంది. అయితే ఈ అక్టోబర్ నెలలో రెండు శక్తివంతమైన గ్రహాల కలియక జరుగుతుంది. దీని వలన నాలుగు రాశుల వారికి అదృష్టం పట్టనుందంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.
Updated on: Oct 19, 2025 | 4:55 PM

దాదాపు 18 ఏళ్ల తర్వాత కుజుడు, శుక్రుడు వృశ్చిక రాశిలో కలయిక జరపనున్నారు. చాలా రోజుల తర్వాత జరిగే ఈ కలయిక 12 రాశులపై దాని ప్రభావం చూపెట్టగా , నాలుగు రాశుల వారికి మాత్రం అనుకోని విధంగా ప్రయోజనాలు చేకూర్చనున్నదంట.

వృశ్చక రాశి : ఈ రాశి వారికి ఊహించని విధంగా అదృష్టం తలపు తట్టతుంది. పనులు వేగంగా పూర్తి అవుతాయి. ఉద్యోగప్రయత్నాలు లాభిస్తాయి. అనుకోని విధంగా డబ్బు చేతికందుతుంది. ఈ రాశి వారు ఎవరైతే చాలా రోజుల నుంచి తీర్థయాత్రలు ప్లాన్ చేస్తున్నారో, వారి కోరిక నెరవేరుతుంది.

కుంభ రాశి : ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. అనుకోని విధంగా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. స్థిరాస్తి కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. ఆర్థికంగా దృఢంగా ఉంటారు.

మీన రాశి : మీన రాశి వారికి కుజ, శుక్ర గ్రహాల కలయిక వలన సంపద పెరుగుతుంది. విద్యార్థులకు అన్ని విధాల కలిసి వస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే ఛాన్స్ ఉంది. ఉద్యోగస్తులు ప్రమోషన్స్ అందుకుంటారు. ఆర్థికంగా కలిసి వస్తుంది.

ధనస్సు రాశి : ధన స్సు రాశి వారికి ఊహించని ప్రయోజనాలు చేకూరనున్నాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు అందుకుంటారు.



