Astro Tips: హిందూ మతంలో ఆదివారం సూర్య భగవానుడికి అంకితం చేయబడింది. ఈ రోజున ప్రత్యేకంగా సూర్య భగవానుడిని పూజిస్తారు. ఆదివారం నాడు సూర్యభగవానుడిని పూజించడం, కొన్ని చర్యలు పాటించడం వలన భగవంతుడు సంతోషిస్తాడని, భక్తుల సమస్యలను తొలగించి మంచి జరిగేలా ఆశీర్వదిస్తాడని మత గ్రంధాలు చెబుతున్నాయి. అయితే, ఆదివారం రోజున కొన్ని చేయకూడని పనులు కూడా ఉన్నాయి. పొరపాటున అవి చేసినట్లయితే.. జాతకంలో సూర్యుడి స్థానం బలహీనంగా మారి అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.