AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీశైల మల్లన్నకు వెండి నాగభరణం.. ఆకట్టుకుంటున్న ఐదు శిరస్సుల అద్భుత కళాఖండం

భక్తుల కొంగు బంగారంగా, దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందిన శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి ఆలయంలో భక్తుల నుంచి కానుకల ప్రవాహం కొనసాగుతోంది. జ్యోతిర్లింగా, శక్తి పీఠంగా విశేష ఖ్యాతి పొందిన ఈ క్షేత్రానికి దేశ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తూ తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. స్వామి, అమ్మ వార్లపై ఉన్న భక్తి, విశ్వాసాలకు గుర్తుగా విలువైన ఆభరణాలు, నగలు, బంగారం, వెండి వస్తువులను ఆలయానికి విరాళంగా అందజేస్తున్నారు.

J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Jun 09, 2026 | 7:55 PM

Share
ఈ క్రమంలో హైదరాబాద్‌ మేడ్చల్‌కు చెందిన భక్తుడు శివశంకర్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారికి ప్రత్యేకంగా తయారు చేయించిన వెండి నాగభరణాన్ని ఆలయానికి బహూకరించారు. సుమారు 540 గ్రాముల బరువుతో రూపొందించిన ఈ నాగ భరణం ప్రస్తుతం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

1 / 5
ఐదు శిరస్సులతో అత్యంత సుందరంగా, కళాత్మకంగా రూపొందించిన ఈ నాగభరణం కాంతివంతంగా మెరిసిపోతూ దర్శనార్థులను ఆకర్షిస్తోంది. వెండితో చేసినప్పటికీ దీనిపై చేసిన శిల్పకళ, రూపకల్పన ఎంతో ప్రత్యేకంగా ఉండటంతో దీనిని చూసేందుకు భక్తులకు రెండు కళ్లూ చాలడం లేదని ఆలయ వర్గాలు చెబుతున్నాయి.

2 / 5
నాగ భరణాన్ని ఆలయ అధికారులకు అందజేసిన అనంతరం దాతల కుటుంబ సభ్యులు స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయంలోని అమ్మవారి ఆశీర్వచన మండపంలో వేదపండితుల ఆశీర్వాదాలను పొందారు. ఆలయ అధికారులు వారికి స్వామి, అమ్మ వార్ల శేష వస్త్రాలు, లడ్డూ ప్రసాదాలను అందజేసి సత్కరించారు.

3 / 5
ఈ సందర్భంగా మాట్లాడిన దాత శివశంకర్ రెడ్డి, “స్వామివారి అనుగ్రహంతోనే జీవితంలో ఈ స్థాయికి చేరుకున్నాం. ఎన్నో సంవత్సరాలుగా స్వామివారికి నాగభరణం సమర్పించాలని సంకల్పించాం. ఆ కోరిక నేడు నెరవేరడం ఎంతో ఆనందంగా ఉంది. ఇది మా కుటుంబానికి ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి” అని తెలిపారు.

4 / 5
శ్రీశైల క్షేత్రానికి భక్తులు సమర్పించే ఆభరణాలు, విలువైన కానుకలు కేవలం భక్తికి చిహ్నాలే కాకుండా స్వామివారిపై వారి అచంచల విశ్వాసానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. తాజాగా సమర్పించిన ఈ వెండి నాగ భరణం కూడా ఆ జాబితాలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. భక్తి, కళాత్మక, ఆధ్యాత్మికత కలగలిసిన ఈ అద్భుత కానుక ప్రస్తుతం శ్రీశైలం వచ్చిన భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది.

5 / 5
Follow Us
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు

మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?

బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?

ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..

ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?

మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?

సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..

వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్

మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!