- Telugu News Photo Gallery Spiritual photos Navapanchama Raja Yoga brings many benefits to these zodiac signs
నవపంచమ రాజయోగం.. వీరికి పట్టిందల్లా బంగారమే!
నవపంచమ రాజయోగం వలన మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. దాదాపు 62 ఏళ్ల తర్వాత దసర పండుగ సమయంలో నవపంచమ రాజయోగం ఏర్పడబోతుంది. ఇది మూడు రాశుల వారికి ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అనేక ప్రయోజనాలను చేకూర్చ నుంది.
Updated on: Sep 26, 2025 | 10:17 AM

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే గ్రహాల కలయిక వలన కొన్ని సార్లు యోగాలు ఏర్పడుతుంటాయి. అయితే ఈ సారి దసరా పండుగ సమయంలో అన్ని రాజయోగాలకంటే శక్తివంతమైన నవపంచమ రాజయోగం ఏర్పడనున్నది. ఇది చాలా శుభఫలితాలనిస్తుంది.

అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున దసరా పండుగ జరుపుకోనున్నారు ప్రజలందరు. అయితే ఈరోజునే బుధ గ్రహం, గురు గ్రహం, శుక్ర గ్రహాల కలయిక ఏర్పడనున్నదంట. దీని వలన శక్తివంతమైన నవపంచమ రాజయోగం ఏర్పడబోతుంది. కాగా, ఈ రాజయోగం , ఏ రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తుందో ఇప్పుడు మనం చూద్దాం.

మీన రాశి : మీన రాశి వారికి నవపంచమ రాజయోగం వలన ఆర్థికంగా కలిసి వస్తుంది. వృత్తిపరంగా అద్భుతమైన ప్రయోజనాలు అందుకుంటారు. గత కొన్ని రోజుల నుంచి ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఇంటాబయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

వృశ్చిక రాశి : ఈ రాశివారికి పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. ఎవరైతే చాలా రోజుల నుంచి అప్పుల సమస్యతో బాధపడుతున్నారో వారు అప్పుల ఊబి నుంచి బయటపడి చాలా ఆనందంగా గడుపుతారు. ఆర్థికంగా బాగుటుంది. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం చేతికందుతుంది.

ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇవి మీకు మీ కుటుంబానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. విదేశీ ప్రయాణాలు చేయాలి అని కలలు కనే వారి కోరిక తీరనుంది. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు పెరుగుతాయి.



