- Telugu News Photo Gallery Spiritual photos Kuja Budha Yuti in Libra: Success for 6 Zodiac Signs Details in Telugu
Telugu Astrology: కుజ, బుధులు యుతి.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే..!
Kuja Budha Yuti in Libra: అక్టోబర్ 2వ తేదీ నుంచి 24వ తేదీ వరకు తులా రాశిలో కుజ, బుధులు యుతి చెందడం జరుగుతోంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం కుజ, బుధులు ఎక్కడ కలిసినా పోరాట స్ఫూర్తిని పెంచుతాయి. ప్రతిదీ పోరాడి సాధించుకుంటారు. అవకాశాల కోసం నిరీక్షించక, వాటిని వెతికి పట్టుకుంటారు. పట్టుదల, మొండితనం కాస్తంత ఎక్కువ మోతాదులో ఉంటాయి. మేషం, మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, మకర రాశులవారు ఏ ప్రయత్నం చేపట్టినా సఫలం అవుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఒక మూడు వారాల పాటు వీరి జీవితాల్లో యాక్టివిటీ బాగా పెరిగి, తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది.
Updated on: Sep 26, 2025 | 6:54 PM

మేషం: రాశ్యధిపతి కుజుడు సప్తమ స్థానంలో బుధుడితో కలవడం వల్ల ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో తప్పకుండా విజయాలు సాధిస్తారు. జీవితంలో అన్ని విధాలా స్థిరత్వం ఏర్పడుతుంది. ఆస్తిపాస్తుల వివాదాలను, కోర్టు కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకుంటారు. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న కల సాకారం అయ్యే అవకాశం ఉంది. ఆదాయాన్ని పెంచుకుంటారు.

మిథునం: రాశ్యధిపతి బుధుడు పంచమ స్థానంలో కుజుడితో చేరడం వల్ల ప్రతిదీ పోరాడి సాధించుకుంటారు. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. ఆస్తి వివాదం పరిష్కారమై విలువైన ఆస్తి లభిస్తుంది. ఆర్థికంగా లాభాలు కలగడం, ఆదాయాన్ని వృద్ధి చేసుకోవడం ప్రధాన లక్ష్యాలుగా మారడం, వాటిల్లో విజయం సాధించడం జరుగుతుంది. ప్రేమ, పెళ్లి ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగాలు సంపాదించుకునే అవకాశంఉంది.

కర్కాటకం: ఈ రాశికి చతుర్థ స్థానంలో కుజ, బుధుల కలయిక వల్ల ఆస్తి వివాదాలను పట్టుదలగా పరి ష్కరించుకుంటారు. సొంత ఇంటి కల నెరవేరడంతో పాటు వాహన యోగం కూడా పడుతుంది. గట్టి ప్రయత్నాలతో విదేశాల్లో ఉద్యోగం సంపాదించుకునే అవకాశం ఉంది. వీరికి దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. దేనినైనా పట్టుదలగా ప్రయత్నించడం మంచిది. కొత్త ఉద్యోగానికి సంబంధించి అనేక అవకాశాలు చేతికి అందుతాయి. ఉద్యోగంలో సరికొత్త నైపుణ్యాలను పెంచుకుంటారు.

తుల: ఈ రాశిలో కుజ, బుధులు యుతి చెందడం వల్ల ఈ రాశివారు ఏ రంగంలో ఉన్నా దూసుకుపోతారు. ఆదాయ వృద్ధి, ఉద్యోగం, సమస్యల పరిష్కారం వంటి విషయాల్లో తమకు అంది వచ్చిన ఏ సదవకాశాన్నీ వదిలిపెట్టరు. ప్రేమ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. విదేశాల్లో ఉద్యోగం సంపాదించుకునే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు రాజీమార్గంలో పరిష్కారమవుతాయి. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో అందలాలు ఎక్కడానికి అవకాశం ఉంది.

ధనుస్సు: ఈ రాశికి లాభ స్థానంలో బుధ, కుజుల కలయిక వల్ల ఉద్యోగంలో పదోన్నతికి, జీతభత్యాల పెరుగుదలకు అవకాశం ఉంది. అధికారులను తమ పనితీరుతో ఆకట్టుకుంటారు. సరికొత్త నైపుణ్యా లను అలవరచుకుంటారు. వృత్తి, ఉద్యోగాలరీత్యా ఇతర దేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఎంతో దూరదృష్టితో, తెలివితేటలతో వ్యవహరించి షేర్లు, స్పెక్యులేషన్లలో బాగా లాభాలను పొందుతారు. సొంత ఇంటిని, వాహనాన్ని సమకూర్చుకుంటారు. ఆదాయ వృద్ధికి అనేక మార్గాలను అనుసరిస్తారు.

మకరం: ఈ రాశికి దశమ స్థానంలో కుజ, బుదుల యుతి వల్ల పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో సీనియర్లను కాదని పదోన్నతులు పొందుతారు. కొద్ది ప్రయత్నంతో విదేశీ అవకాశాలు అందడం కూడా జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు కొద్ది మార్పులు, చేర్పులతో కొత్త పుంతలు తొక్కుతాయి. ప్రేమ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు విస్తరిస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్ల మీద పెట్టుబడులు పెట్టి లాభాలు సంపాదిస్తారు.



