- Telugu News Photo Gallery Spiritual photos If a crow caws at home, is it a bad omen? Is it a good omen?
ఇంటి వద్ద కాకి అరిస్తే.. చెడు శకునమా.? మంచి శకునమా.?
భారతీయ సంస్కృతిలో జంతువులు, పక్షులకు కూడా ప్రముఖ ప్రాధాన్యత ఇస్తారు. జంతువులు, పక్షుల ప్రవర్తనను కూడా లెక్కలోకి తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా కాకుల గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. కాకులు పర్యావరణానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. కానీ కాకులను అశుభంగా భావిస్తారు. కాకులు ఇంటి ముందు అరుస్తే మంచిది కాదంటారు. ఇలా అరవడం వల్ల చెడు జరుగుతుందా లేక మంచి జరుగుతుందా ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యోదయ సమయంలో కాకులు..
Updated on: Aug 22, 2025 | 12:43 PM

భారతీయ సంస్కృతిలో జంతువులు, పక్షులకు కూడా ప్రముఖ ప్రాధాన్యత ఇస్తారు. జంతువులు, పక్షుల ప్రవర్తనను కూడా లెక్కలోకి తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా కాకుల గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. కాకులు పర్యావరణానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. కానీ కాకులను అశుభంగా భావిస్తారు.

కాకులు ఇంటి ముందు అరుస్తే మంచిది కాదంటారు. ఇలా అరవడం వల్ల చెడు జరుగుతుందా లేక మంచి జరుగుతుందా ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యోదయ సమయంలో కాకులు ఇంటి ముందుకు వచ్చి అరుస్తే అది శుభ ప్రదమే. మీ జీవితంలో ఆర్థిక పురోభివృద్ధి రాబోతుందని సూచిస్తారు

ఇంటి ఆవరణ లేదా ఇంటి పై కప్పుపై అరిస్తే ఇంటికి ఎవరో అతిథి రాబోతున్నారని సంకేతంగా పరిగణిస్తారు. అతిథులు ఇంటికి రావడం వల్ల మంచి జరుగుతుందని ఆశిస్తారు. అయితే కాకి ఇంటి ముందుకు అకస్మాత్తుగా వచ్చి పదే పదే గట్టిగా అరుస్తే అది సంక్షోభానికి సంకేతంగా భావిస్తారు.

ఇంటి ఆవరణ లేదా ఇంటి పై కప్పుపై అరిస్తే ఇంటికి ఎవరో అతిథి రాబోతున్నారని సంకేతంగా పరిగణిస్తారు. అతిథులు ఇంటికి రావడం వల్ల మంచి జరుగుతుందని ఆశిస్తారు. అయితే కాకి ఇంటి ముందుకు అకస్మాత్తుగా వచ్చి పదే పదే గట్టిగా అరుస్తే అది సంక్షోభానికి సంకేతంగా భావిస్తారు.

అంతే కాకుండా కాకులు వచ్చి పదే పదే అరవడం వల్ల ఇంట్లో వివాదాలు, కలహాలు, గొడవలకు కూడా సంకేతంగా భావిస్తారు. దీని వలన ఇంట్లోని కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, విభేదాలు పెరగచ్చని శకున శాస్త్రం చెబుతోంది.




