యాగంటి ఉమామహేశ్వరాలయంలోని పుష్కరిణికి 'అగస్త్య పుష్కరిణి' అనే పేరు. మునీశ్వరుడైన అగస్త్యుడు ఈ కోనేరులో స్నానం చేశాడని, అందుకే ఈ కోనేరుకు ఆ పేరు వచ్చిందని స్థలపురాణం. ఈ పుష్కరిణిలోకి నీరు అక్కడున్న ఓ నంది నోటి నుండి వస్తూ వుంటుంది. ఈ పుష్కరిణిలో నీటికి ఔషధ గుణాలు వున్నాయని భక్తుల నమ్మకం