- Telugu News Photo Gallery Spiritual photos Diwali 2022: These 10 countries celebrate Diwali just like we in India do
Diwali: దీపావళిని మనదేశంలోనే కాదు.. ఆ విదేశాల్లో కూడా ఘనంగా జరుపుకుంటారన్న సంగతి తెలుసా..?
చెడుపై మంచి గెలిచిన గుర్తుగా జరుపుకునే పండగ దీపావళి. పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా జరుపుకునే దీపావళి పర్వదినం ఈ ఏడాది అక్టోబర్ 24వ తేదీన వచ్చింది. పండగ సమయం దగ్గర పడడంతో దేశ వ్యాప్తంగా ఉత్సాహం నెలకొంది. ప్రజలు షాపింగ్ చేయడం, ఇళ్లను అలంకరించడం, తమ స్నేహితులకు సన్నిహితులకు బహుమతులు ప్లాన్ చేయడంలో బిజీగా ఉన్నారు.
Updated on: Oct 13, 2022 | 2:33 PM

అయితే దీపావళి వేడుకలు, ఉత్సవాలు అన్నీ భారతదేశానికే పరిమితం అని మీరు అనుకుంటే పొరపాటే.. మనదేశంలో దీపావళిని జరుపుకునే విధంగానే ఇతర దేశాల్లో కూడా అదే ఉత్సాహంతో జరుపుకుంటారు. ఈరోజు మనలాగే దీపావళిని జరుపుకునే 10 దేశాల గురించి తెలుసుకుందాం

ఫిజీలో భారతీయ జనాభా అధికంగా ఉన్నందున.. దీపావళిని ఇక్కడ చాలా వైభవంగా జరుపుకుంటారు. దీపావళి అక్కడ ప్రభుత్వ సెలవుదినం. ప్రజలు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం,పార్టీలను పెద్ద ఎత్తున నిర్వహించుకోవడంలో నిమగ్నమై ఉంటారు. స్కూళ్లు, కాలేజీలు మూతపడతాయి కూడా

కెనడాను అనధికారికంగా 'మినీ పంజాబ్' అని పిలుస్తారు. ఎందుకంటే అక్కడ ఎక్కువ సంఖ్యలో పంజాబీలు స్థిరపడ్డారు. ఎంతగా అంటే, కెనడా పార్లమెంటులో పంజాబీ మూడవ అధికారిక భాష. ఇక్కడ దీపావళి అతి పెద్ద పండగ.

కరేబియన్ దీవులు చాలా ఉత్సాహంగా దీపావళిని జరుపుకుంటాయి. రామాయణంలోని దృశ్యాలను వర్ణించే విస్తృతమైన థియేట్రికల్ వేడుకలలో ప్రధాన భాగం.

ఇండోనేషియాలో ఎక్కువ మంది భారతీయులు లేనప్పటికీ, ఇక్కడ దీపావళి అతి పెద్ద పండగ. భారతదేశంలో దీపావళి నాడు చేసే దాదాపు అన్ని ఆచారాలు ఇండోనేషియా ప్రజలు కూడా అనుసరిస్తారు.

భారతదేశంలో కాకుండా, మలేషియాలో దీపావళిని హరి దీపావళి అని పిలుస్తారు. అయితే మనదేశంలో జరుపుకునే దీపావళికి ఇక్కడ చేసే దీపావళికి కొంచెం భిన్నంగా ఆచారలుంటాయి. ప్రజలు నూనెతో స్నానం చేసి, వివిధ దేవాలయాల్లో ప్రార్థనలు చేయడంతో రోజు ప్రారంభమవుతుంది. అయితే మలేషియాలో దీపావళి మందుగుండు సామాగ్రిని అమ్మకం నిషేధం. కనుక అక్కడ ప్రజలు బహుమతులు, స్వీట్లు ఇచ్చిపుచ్చుకుంటారు. శుభాకాంక్షలను చెప్పుకుంటారు.

మారిషస్ జనాభాలో దాదాపు 50 శాతం మంది హిందువులే.. ఇక్కడ దీపావళిని చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ దేశంలో దీపావళి పండగ ప్రభుత్వ సెలవు దినం.

దీపావళిని నేపాల్‌లో తీహార్ అని పిలుస్తారు. ఇక్కడ ప్రజలు చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. దీపావళి రోజున తమ ఇళ్ళను అలంకరిస్తారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం, లక్ష్మీదేవికి ప్రార్థనలు చేయడం వంటివి ఉంటాయి. నేపాల్‌లో దశైన్ తర్వాత రెండవ అతిపెద్ద పండుగ దీపావళి.

భారతదేశం వెలుపల దీపావళి ఫీవర్ పీక్స్‌లో ఉన్న ప్రదేశం ఏదైనా ఉందంటే అది సింగపూర్‌లోని లిటిల్ ఇండియా మాత్రమే. ప్రకాశవంతమైన రంగోలిలు, విస్తృతమైన అలంకరణతో ఉత్సవాలు చూడదగిన దృశ్యం.

శ్రీలంకలో హిందువుల జనాభా అధికంగా ఉంది. అందువల్ల దీపావళిని ఇక్కడ చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఇది భారతదేశానికి దగ్గరగా ఉండటమే కాదు.. దీపావళి పండుగ మూలంలో శ్రీలంక కూడా పాత్ర ఉన్నట్లు పురాణాల కధనం. అందుకనే ఇక్కడ ప్రజలు చాలా ఉత్సాహంగా దీపావళిని జరుపుకుంటారని అంటారు.

UKలోని అనేక నగరాలు, ముఖ్యంగా బర్మింగ్‌హామ్ మరియు లీసెస్టర్‌లో భారీ స్థాయిలో భారతీయ కమ్యూనిటీ స్థిరపడినందున దీపావళిని పెద్ద ఎత్తున జరుపుకుంటారు. ఉత్సవాలు దాదాపు భారతదేశంలో మాదిరిగానే జరుపుకుంటారు.





























