- Telugu News Photo Gallery Spiritual photos Budha and Shani Vakri: These are lucky zodiac signs details in Telugu
Lucky Zodiac Signs: వక్రగతిలో బుధ, శనులు.. కొన్ని రాశులకు ఊహించని అదృష్టాలు
ఈ నెల(జులై)లో రెండు ప్రధాన గ్రహాలు వక్రగతి పడుతున్నాయి. ఇందులో శనీశ్వరుడు ఈ నెల 13 నుంచి నవంబర్ 28 వరకు వక్రగతి చెందుతుండగా, బుధుడు ఈ నెల 20 నుంచి ఆగస్టు 8 వరకు వక్ర సంచారం చేస్తోంది. సుమారు 18 రోజుల పాటు రెండు గ్రహాలు వక్రించడం వల్ల కొన్ని రాశులకు ఊహించని శుభ యోగాలు కలుగుతాయి. జీవితంలో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, మకర రాశుల వారికి ఈ రెండు గ్రహాల వక్రగతి జీవితాల్ని కొత్త పుంతలు తొక్కిస్తుంది.
Updated on: Jul 14, 2025 | 3:04 PM

వృషభం: ఈ రాశికి అత్యంత శుభ గ్రహాలైన శని, బుధులు బాగా అనుకూల స్థానాల్లో వక్రించడం వల్ల రాజయోగాలు, ధనయోగాలు కలిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. జీతభత్యాలు, రాబడి, లాభాలు, ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. పిల్లలు బాగా వృద్ధి లోకి వస్తారు. సంతాన యోగం కలుగుతుంది. మదుపులు, పెట్టుబడులు బాగా లాభిస్తాయి.

మిథునం: ధన స్థానంలో ఉన్న రాశ్యధిపతి బుధుడు, దశమ స్థానంలో ఉన్న శనీశ్వరుడు వక్రించడం వల్ల ఈ రాశివారికి షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అనేక మార్గాల్లో అదనపు ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. పిత్రార్జితం చేతికి అందుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన ఆఫర్లు అందుతాయి. పిల్లలు చదువుల్లో బాగా వృద్ధిలోకి వస్తారు. కోర్టు కేసులు, ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి.

కర్కాటకం: ఈ రాశిలో ఉన్న బుధుడు, భాగ్య స్థానంలో ఉన్న శని వక్రించినందువల్ల ఈ రాశివారు త్వరలో విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నించే ఉద్యోగులు, నిరుద్యోగులు తప్పకుండా శుభవార్తలు వింటారు. ఆదాయపరంగా పెనుమార్పులు చోటు చేసుకుం టాయి. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. అనారోగ్యాల నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు.

కన్య: రాశినాథుడైన బుధుడు లాభ స్థానంలోనూ, శని సప్తమ స్థానంలోనూ వక్రించడం వల్ల వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి నిశ్చయం అవుతుంది. ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. రావలసిన సొమ్ము, రాదనుకున్న సొమ్ము చేతికి అందుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి.

తుల: ఈ రాశికి దశమ స్థానంలో ఉన్న బుధుడు, ఆరవ స్థానంలో ఉన్న శని వక్రించడం వల్ల ఉద్యోగాల్లో తప్పకుండా రాజయోగాలు, ధన యోగాలు కలుగుతాయి. ఉద్యోగంలో హోదాతో పాటు జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీతో పాటు రాబడి వృద్ధి చెందుతుంది. రావా ల్సిన సొమ్ము కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

మకరం: ఈ రాశికి తృతీయ స్థానంలో ఉన్న రాశ్యధిపతి శనీశ్వరుడు, సప్తమ స్థానంలో ఉన్న భాగ్యాధిపతి బుధుడు వక్రించడం వల్ల ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. శుభవార్తలు ఎక్కువగా వినే అవకాశం ఉంది. గృహ ప్రయత్నాలు సానుకూలపడతాయి. కొద్ది ప్రయత్నంతో ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమవుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.



