- Telugu News Photo Gallery So Many Benefits of eating while sitting on floor, check here is details in Telugu
Sit on Floor: నేలపై కూర్చుని తింటే ఉండే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు..
ఇప్పుడంటే డైనింగ్ టేబుల్స్ వచ్చాయి. అలాగే ఎక్కడ పడితే అక్కడ కూర్చొని భోజనం చేస్తున్నారు. కానీ ఇంతకు ముందు అయితే కేవలం నేలపైనే కూర్చొని తినేవారు. కాళ్లు మడిచి నేలపై కూర్చొని భోజనం చేస్తే చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇలా కూర్చొని తినడం వల్ల జీర్ణ క్రియకు కూడా చాలా మంచిది. నేలపై కూర్చొని తినడం కూడా ఒక ఆసనం వేసినట్టే. కాలు మడిచి కూర్చోవడాన్ని సుఖాసనం అంటారు. ఇలా కూర్చోవడం వల్ల జీర్ణ క్రియని పెంచుతుంది. అంతే కాకుండా ఈ భంగిమ సహజంగానే ఉదర కండరాలని..
Updated on: Jul 12, 2024 | 1:52 PM

ఇప్పుడంటే డైనింగ్ టేబుల్స్ వచ్చాయి. అలాగే ఎక్కడ పడితే అక్కడ కూర్చొని భోజనం చేస్తున్నారు. కానీ ఇంతకు ముందు అయితే కేవలం నేలపైనే కూర్చొని తినేవారు. కాళ్లు మడిచి నేలపై కూర్చొని భోజనం చేస్తే చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇలా కూర్చొని తినడం వల్ల జీర్ణ క్రియకు కూడా చాలా మంచిది.

నేలపై కూర్చొని తినడం కూడా ఒక ఆసనం వేసినట్టే. కాలు మడిచి కూర్చోవడాన్ని సుఖాసనం అంటారు. ఇలా కూర్చోవడం వల్ల జీర్ణ క్రియని పెంచుతుంది. అంతే కాకుండా ఈ భంగిమ సహజంగానే ఉదర కండరాలని కూడా సడలిస్తుంది.

సూఖాసనంలో కూర్చోవడం వల్ల నరాలకి కూడా సపోర్ట్‌గా ఉంటుంది. ఇది పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థని నియంత్రిస్తుంది. ఇలా కూర్చోవడం వల్ల ప్రశాంతంగా, రిలాక్సింగ్‌గా ఉంటుంది. పోషకాలను శరీరానికి అందిస్తుంది.

కాళ్లు మడిచి నేలపై కూర్చుని తినడం వల్ల భోజనం అనేది సంతృప్తిగా తింటారు. ఇలా కూర్చుని తినడం వల్ల జీర్ణ సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. మానసిక, శారీరక ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

కూర్చుని తినడం వల్ల సంతృప్తిగా తింటారు. నేలపై కాళ్లు మడిచి కూర్చోవడం వల్ల పొట్టపై భారం పడుతుంది. కాబట్టి ఎక్కువగా తినకుండా మితంగా తీసుకుంటారు. కొద్దిగా తినగానే కడుపు నిండిన భావన ఉంటుంది.




