- Telugu News Photo Gallery Sircilla, Man Try to Suicide alleges that His Wife Scolding Him, Police Saved
Telangana: ‘భార్య తిట్టింది.. ఇక నేను బ్రతికి వేస్ట్’.. ఓ భర్త నడిరోడ్డుపై ఏం చేశాడో చూడండి..!
Sircilla News: ఫుల్లుగా మందు కొట్టాడు. నడి ఊర్లోకి వచ్చాడు. గాంధీ విగ్రహం సాక్షిగా బలన్మరణానికి పాల్పడబోయాడు. వందలాది మంది ఆ దారి వెంట పోతున్నా ఏ ఒక్కరూ ఆపిన దాఖలాలు లేవు. చివరకు ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చి అతని ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్నారు. మరి ఆ వ్యక్తి చనిపోవాలని భావించడానికి కారణం ఏంటో తెలుసా? తిట్లే కారణం అట.
Updated on: Oct 04, 2023 | 1:51 PM

Sircilla News: ఫుల్లుగా మందు కొట్టాడు. నడి ఊర్లోకి వచ్చాడు. గాంధీ విగ్రహం సాక్షిగా బలన్మరణానికి పాల్పడబోయాడు. వందలాది మంది ఆ దారి వెంట పోతున్నా ఏ ఒక్కరూ ఆపిన దాఖలాలు లేవు. చివరకు ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చి అతని ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్నారు. మరి ఆ వ్యక్తి చనిపోవాలని భావించడానికి కారణం ఏంటో తెలుసా? తిట్లే కారణం అట. అవును ఆ తిట్ల కారణంగానే అతను చనిపోవాలని డిసైడ్ అయ్యాడట. అసలు అతన్ని ఎవరు తిట్టారు.. ఎందుకు తిట్టారు.. అసలు మ్యారట్ ఏంటో ఈ కథనంలో తెలుసుకోండి..

ఫుల్లుగా మందుకొట్టి నడి ఊర్లోకి చేరి, గాంధీ విగ్రహం కొరకు ఏర్పాటు చేసిన గ్రిల్ కు ఉరి వేసుకోవడానికి యత్నించిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ కు చెందిన గడిపెళ్లి మల్లేశం అనే వ్యక్తి గాంధీ విగ్రహం వద్ద ఉరి వేసుకోవడానికి ప్రయత్నించాడు.

ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఎంటి అని మల్లేశంను వివరణ అడుగగా షాకింగ్ కారణం చెప్పాడు. ఇంట్లో తనను తన భార్య మందలించిందని, ఆ అవమానం తట్టుకోలేక పోతున్నాని అన్నాను. ఇక తాను బ్రతికి వెస్ట్ అని, తనను చావనివ్వండి అంటూ హల్‌చల్ చేశాడు.

సిరిసిల్ల మార్కెట్ వద్ద రౌండ్ సర్కిల్‌లో ఉన్న గాంధీ విగ్రహం చుట్టూ ఏర్పాటు చేసిన స్టీల్ గ్రిల్స్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. అయితే, అదే సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు అతన్ని గమనించారు.

హోంగార్డ్ మల్లేశం సదరు వ్యక్తిని గమనించి పరుగెత్తాడు. ఉరి వేసుకుంటున్న మల్లేశంను అడ్డుకున్నాడు. మల్లేశంను అదుపులోకి తీసుకొని స్థానిక పోలీసు స్టేషన్ కు తరలించారు. తాగిన మైకంలో ఉన్నట్లు గుర్తించారు. మత్తు దిగిన తరువాత.. కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు.
