రొయ్యల బిర్యానీ ఇలా చేస్తే.. టేస్ట్ అదిరిపోవాల్సిందే!
రొయ్యలకర్రీ, రొయ్యల బిర్యానీ అటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చాలా మంది ఎంతో ఇష్టంగా దీనిని తింటుంటారు. అయితే మనం ప్పుడు ఇంట్లోనే సులభంగా రొయ్యల బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చాలా మంది చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, రొయ్యల బిర్యానీ రెస్టారెంట్‌లో ఇష్టంగా తింటుంటారు. మరి ఎప్పుడూ రెస్టారెంట్‌లోనే తింటేనే ఏం బాగుంటుంది చెప్పండి, అందుకే ఇప్పుడు మనం సింపుల్‌గా ఇంట్లోనే రొయ్యల బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం.
Updated on: Oct 23, 2025 | 4:48 PM

రొయ్యల బిర్యానీకి కావాల్సిన పదార్థాలు : రొయ్యలు 250 గ్రాములు, బాస్మతి బియ్యం ఒక కప్పు, ఉల్లిపాయ ఒకటి, టమోటా ఒకటి, పచ్చి మిర్చి మూడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పెరుగు రెండు టేబుల్ స్పూన్స్, బిర్యానీ మసాలా 1 టేబుల్ స్పూన్, నెయ్యి రెండు టేబుల్ స్పూన్స్, కొత్తి,మీర , పూదీనా, నిమ్మకాయ ఒకటి.

తయారీ విధానం : ముందుగా రొయ్యలను నీటుగా శుభ్రం చేసుకోవాలి. వాటి తలలు, తోకలు తీసి వేసి, కొంచెం ఉప్పు , నిమ్మరంసం వేసుకొన్న నీటిలో 10 నిమిషాలు ఉండనివ్వాలి. తర్వాత కొద్దిగా నూనె వేసి, వాటిని తేలికగా వేయించుకోవాలి. తర్వాత బాస్మతి బియ్యాన్ని కడిగి, పాన్‌లో నానబెట్టుకోవాలి. తర్వాత బియ్యం ఉడికేందుకు సరిపడ నీరు పోసి, దానిని మరగబెట్టి, అందులో బియ్యం వేసి, ఉడకబెట్టుకోవాలి.

తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి. అందులో నూనె లేదా నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. తర్వాత అందులో ఉల్లిపాయలు వేసి, బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత అదే నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్, మిర్చీ, టామోటాలు, పెరుగు, సుగంధ ద్రవ్యాలు వేసి ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి.

తర్వాత అవి మంచిగా వేగాయి అనిపించిన తర్వాత అందులో రొయ్యలు వేసి ఐదు నిమిషాలపాటు పచ్చి వాసన పోయేలా వేయించుకోవాలి. ఆ తర్వాత బియ్యం వేసి మూత పెట్టుకోవాలి. బియ్యం ఉడికిన తర్వాత దానిపై పూదీన, కొత్తి మీర వేసి మరో 10 నిమిషాలు ఉండనివ్వాలి. అంతే వేడి వేడి రొయ్యల బిర్యానీ రెడీ.