- Telugu News Photo Gallery Similar symptoms appear due to magnesium deficiency in the body, check here is details in Telugu
Health Care: తరచూ వికారంగా ఉంటుందా.. అయితే ఇదే కారణం అయి ఉండొచ్చు!
ఒక మనిషి ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే.. ఎన్నో రకాల పోషకాలు అవసరం అవుతాయి. వాటిల్లో ఏది తక్కువ.. ఎక్కువ అయినా సమస్యలు తప్పవు. అందుకే అన్ని రకాల ఆహారాలు తీసుకోవాలి అని వైద్యులు చెబుతూ ఉంటారు. అయితే కొంత మంది సరైన ఆహారం తీసుకోక పోవడం కారణంగా అనేక సమస్యలకు గురి అవుతూ ఉంటారు. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తప్పని సరి. శరీరానికి ఉపయోగ పడే అయ్యే పోషకాల్లో మెగ్నీషియం కూడా ఒకటి. మెగ్నీషియం శరీరంలో పలు కీలక విధులను..
Updated on: Mar 11, 2024 | 3:00 PM

ఒక మనిషి ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే.. ఎన్నో రకాల పోషకాలు అవసరం అవుతాయి. వాటిల్లో ఏది తక్కువ.. ఎక్కువ అయినా సమస్యలు తప్పవు. అందుకే అన్ని రకాల ఆహారాలు తీసుకోవాలి అని వైద్యులు చెబుతూ ఉంటారు. అయితే కొంత మంది సరైన ఆహారం తీసుకోక పోవడం కారణంగా అనేక సమస్యలకు గురి అవుతూ ఉంటారు. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తప్పని సరి.

శరీరానికి ఉపయోగ పడే అయ్యే పోషకాల్లో మెగ్నీషియం కూడా ఒకటి. మెగ్నీషియం శరీరంలో పలు కీలక విధులను నిర్వర్తిస్తుంది. నరాల పనితీరు, కండరాల పని తీరు సరిగ్గా ఉండాలంటే.. మెగ్నీషియం ఖచ్చితంగా కావాలి. అంతే కాకుండా గుండె ఆరోగ్యంగా ఉండి.. సమస్యలు రాకుండా ఉండాలంటే.. మెగ్నీషియం చాలా అవసరం.

అదే విధంగా ఎముకలు దృఢంగా పని చేయాలన్నా మెగ్నీషియం హెల్ప్ చేస్తుంది. ఇలా మెగ్నీషియం శరీరంలో అనేక విధులను నిర్వర్తిస్తుంది. మెగ్నీషియం లోపం తలెత్తడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది.

శరీరంలో మెగ్నీషియం సరిపడినంత లేకపోతే.. నరాల తిమ్మిర్లు, నరాలు పట్టేసినట్టు ఉండటం, నరాల్లో సూదులు గుచ్చినట్టు ఉండటం, గుండె దడ, కండరాలు బలహీన పడటం, అప్పుడప్పుడు వణుకు రావడం, వికారం, ఆకలి లేకపోవడం, వాంతులు, వంటి లక్షణాలు కనిపిస్తాయి.

అంతే కాకుండా ఒత్తిడి, ఆందోళన, భయం, నీరసం, బలహీనంగా ఉండటం, నిద్ర లేమి, తల నొప్పి, మైగ్రేన్ సమస్యలు కూడా కనిపిస్తాయి. కాబట్టి ఈ లక్షణాలు మీలో కనిపించినట్లయితే వెంటనే.. వైద్యుల్ని సంప్రదించడం మేలు.




