- Telugu News Photo Gallery Side Effects Plastic Straw: Using plastic Straw Is Harmful To Health know details in Telugu
Plastic Straw: మంచినీళ్లు, శీతల పానీయాలు తాగేందుకు ప్లాస్టిక్ స్ట్రా వాడుతున్నారా? ఎన్ని వ్యాధుల బారిన పడతారో తెలుసా..!
చాలా మంది రెస్టారెంట్లకు వెళ్తుంటారు. దీంతో తాగడానికి ఏదైనా ఆర్డర్ ఇస్తే మంచినీళ్లు, జ్యూస్, శీతల పానీయాలను స్ట్రాతోనే తాగుతున్నారు. సంతోషంగా ఒకొక్క సిప్ చేస్తూ తాగుతున్న దానిని ఎంజాయ్ చేస్తారు. అయితే మీరు అనుసరిస్తున్న ఈ పద్ధతి ఆరోగ్యానికి మంచిదేనా? మీరు ఎప్పుడైనా దాని గురించి ఆలోచించారా? ఇలా స్ట్రాను ఉపయోగించి పానీయాలను తాగడం వలన మీకు తెలియకుండానే శరీరానికి హాని కలుగుతోందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Updated on: Jul 26, 2024 | 8:51 PM

స్ట్రా ద్వారా తాగడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు పెరుగుతాయి. వాస్తవానికి స్ట్రా ద్వారా తాగే సమయంలో అదనపు గాలి కడుపులోకి పీలుస్తుంది. ఫలితంగా గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారికి గ్యాస్ట్రిక్ సమస్య తీవ్రమవుతుంది. జీర్ణ సమస్యలు కూడా రావచ్చు.

స్ట్రాని ఉపయోగించడం వలన చర్మంపై ప్రభావం చూపుతుంది. నోటి కండరాలు త్రాగిన ప్రతిసారీ అదనపు ఒత్తిడికి లోనవుతాయి. ఈ ఒత్తిడి క్రమం తప్పకుండా కొనసాగితే ముఖంపై ముడతలు వస్తాయి. చిన్న వయస్సులోనే ముసలివారుగా చర్మం ముడతలు పడి కనిపిస్తారు.

ఇక స్ట్రా ద్వారా జ్యూస్ లేదా శీతల పానీయాలను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల నోటి క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. దంతాల మీద, నోటి లోపల కొన్ని ప్రదేశాల్లో చక్కెర పేరుకుపోవడం వల్ల కొంత సమయం తర్వాత దంత క్షయం ఏర్పడుతుంది.

ప్రస్తుతం పేపర్ స్ట్రాస్ చాలా అరుదుగా ఉపయోగిస్తున్నారు. అయితే చాలా చోట్ల ప్లాస్టిక్ స్ట్రాస్ వాడుతున్నారు. తత్ఫలితంగా స్ట్రాతో తాగుతున్న సమయంలో ఆ వ్యక్తీ శరీరంలో ప్లాస్టిక్‌లోని సూక్ష్మ కణాలు చేరే ప్రమాదం ఉంది. ఇది ఆరోగ్యానికి హానికరం.

ప్లాస్టిక్‌లోని చిన్న కణాలు శరీరంలోకి ప్రవేశించి.. అక్కడి నుంచి కడుపులోకి ప్రవేశించి ప్రతిరోజూ కొద్ది మొత్తంలో రక్తంలో కలిసిపోతాయి. ఇది భవిష్యత్తులో ఏదైనా తీవ్రమైన వ్యాధికి దారి తీస్తుంది. ఈ కారణంగానే నీటిని నిల్వ చేసేందుకు కూడా ప్లాస్టిక్ బాటిళ్ల వాడకాన్ని తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు.

అయితే స్ట్రా లేకుండా గ్లాస్ తో నీరు, జ్యూస్ ని లేదా పానీయాలు తాగడం వల్ల దంతాలు శుభ్రపడతాయి. నోటిలోని బ్యాక్టీరియాను శుభ్రంగా ఉంచుతుంది.




