Subhash Goud |
Updated on: Jul 08, 2022 | 3:14 PM
Health Care tips: విటమిన్ డి శరీరానికి చాలా అవసరం. కానీ మోతాదు అధికమైతే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. వివిధ వ్యాధులకు కారణమవుతుంది. ప్రజలు దాని లోపాన్ని భర్తీ చేయడానికి సప్లిమెంట్లను కూడా తీసుకుంటున్నారు. మోతాదు ఎక్కువైతే మీరు ఏ వ్యాధుల బారిన పడతారో తెలుసుకోండి.
వాంతులు: మీరు విటమిన్ డి అధిక మోతాదులో వేసుకున్నట్లయితే ఇబ్బందులకు గురవుతారు. వాంతులు, వీరేచనాలు అయ్యే అవకాశం ఉంది. అలాంటి సమయంలో వెంటనే వైద్యులను సంప్రదించాలి.
మానసిక అనారోగ్యం: ఏదైనా ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఎలాంటి నష్టం వాటిల్లుతుందో.. విటమిన్ డి విషయంలో కూడా అంతే. మీరు పరిమితికి మించి విటమిన్ డి తీసుకుంటే మానసిక వ్యాధులను ఎదుర్కొవలసి ఉంటుంది.
ఆకలి లేకపోవడం: విటమిన్ డి తీసుకోవడం కోసం తప్పుడు మార్గాలను అనుసరించడం వల్ల ఆకలి తగ్గినట్లు చాలా మందికి అనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. వీటికి బదులుగా మీరు సూర్యకాంతి వంటి సహజ పద్ధతుల ద్వారా విటమిన్ డి లోపాన్ని అధిగమించవచ్చు.