ఈ పూలు రాత్రిపూట విశ్రాంతి తీసుకుంటాయని, పగటిపూట సూర్యకాంతి పడగానే మళ్లీ చురుగ్గా మారతాయని కూడా పరిశోధనలో తేలింది. పెరుగుతున్న సూర్యకాంతితో, పొద్దుతిరుగుడు పువ్వుల కార్యకలాపాలు కూడా పెరుగుతాయి. హీలియో ట్రాపిజం వల్ల ఇదంతా సాధ్యమైంది.మొక్కలో ఉన్న అమైనో ఆమ్లాలు, కార్బోహైడ్రేటులు విచ్ఛిన్నం అయి ఆక్సిన్ అనే హార్మోన్ ఏర్పడుతుంది. ఇది మొక్క పెరుగుదలకి ఉపయోగపడుతుంది. పొద్దుతిరుగుడు కాండం లో ఉన్న ఆక్సిన్ హార్మోన్ వల్ల సూర్య రశ్మి వైపుకు పువ్వు తిరుగుతుంది.