ఆరోగ్యానికి మేలని పుచ్చకాయ గింజలు తింటున్నారా?.. వీరికి యమ డేంజర్‌!

28 April 2025

TV9 Telugu

TV9 Telugu

వేసవిలో పుచ్చకాయ తినడం చాలా ప్రయోజనకరం. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. దాదాపు 95 శాతం నీటిని నింపుకొన్న ఈ సీజనల్‌ ఫ్రూట్‌లో శరీరానికి చలువనిచ్చే గుణాలు పుష్కలంగా ఉంటాయి. అయితే చాలామంది ఈ పండును తినేటప్పుడు గింజలను పక్కన పడేస్తుంటారు

TV9 Telugu

పుచ్చకాయ గింజలను పక్కన పెట్టేయడమంటే చేతికందిన పోషకాలను దూరం చేసుకున్నట్లేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రొటీన్లు, విటమిన్లు లాంటి పోషకాలు వీటిలో పుష్కలంగా ఉంటాయని వారు సూచిస్తున్నారు

TV9 Telugu

పుచ్చకాయ పండులో ఉన్న పోషక విలువల్లో ఎక్కువ భాగం వాటి గింజల నుంచే లభిస్తుంది. వీటిలో ప్రొటీన్లు, విటమిన్స్‌తో పాటు మెగ్నీషియం, ఐరన్‌, పొటాషియం, కాపర్‌, జింక్‌, మాంగనీస్‌, ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి

TV9 Telugu

ఇవి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించడమే కాకుండా చర్మం, జుట్టు సంరక్షణలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. పుచ్చకాయ గింజలు ప్రోటీన్‌కు మంచి మూలం. వీటిని తినడం వల్ల ఒంట్లో వేడి తగ్గుతుంది

TV9 Telugu

ఇది మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. మధుమేహానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. పుచ్చకాయ గింజలను మెత్తగా చేసి హెయిర్ మాస్క్ లా వేసుకోవచ్చు. ఇది జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది

TV9 Telugu

అయితే అలెర్జీ ఉన్నవారు, అధిక ప్రోటీన్ ఆహారం నిషేధించబడినవారు పుచ్చకాయ గింజలను తినకూడదని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు

TV9 Telugu

సాధారణంగా పుచ్చకాయ గింజలను ఎండబెట్టి లేదా వేయించి తింటారు. కానీ దీన్ని పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. అతిగా తినడం కూడా ఆరోగ్యానికి హానికరం

TV9 Telugu

అలాగే, ఏదైనా ఆరోగ్య పరిస్థితి ఉంటే, ప్రతిరోజూ తినడానికి ముందు నిపుణుల సలహా మేరకు తీసుకోవడం మంచిది. మన శరీర అవసరాలకు అనుగుణంగా మాత్రతే వీటిని తీసుకోవాలి