- Telugu News Photo Gallery Science photos International Space Station in problematic conditions says Russia astronauts
International Space Station: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పగుళ్ళు.. అవి మరింత పెద్దవి అయ్యే అవకాశం..
అంతరిక్ష పరిశోధనల్లో నాసాతో పాటు పలు దేశాల శాస్త్రవేత్తలకు అండగా ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కాలం చెల్లిందని వ్యోమగాములు చెబుతున్నారు.
Updated on: Sep 04, 2021 | 9:00 PM

అంతర్జాతీయ అంతరిక్షా కేంద్రం ప్రమాదంలో ఉందా? ఈ ప్రశ్నకు రష్యా వ్యోమగాములు అవుననే సమాధానమే చెబుతున్నారు. అంతరిక్ష కేంద్రంలోని ఒక విభాగంలో పగుళ్ళు వచ్చాయని వారు అంటున్నారు. భవిష్యత్ లో ఈ పగుళ్ళు మరింత విస్తరించే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.

గతంలో కూడా అంతరిక్ష పరిశోధనల కోసం వెళ్ళిన అంతరిక్ష యాత్రికులు కూడా కేంద్రంలో పరికరాలకు కాలం చేల్లినట్లు చెప్పారు. అప్పట్లో వారు ఈ పరికరాలు 2025 తరువాత పూర్తిగా పాడైపోయే అవకాశం ఉందని చెప్పారు.

రాకెట్ స్పేస్ కార్పొరేషన్ ఎనర్జియా చీఫ్ ఆఫీసర్ వ్లాదిమిర్ సోలోవియోవ్ మాట్లాడుతూ పరికరాలను మార్చాల్సిన అవసరం ఉందని చెప్పారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం జర్యా మాడ్యూల్‌లోని కొన్ని ప్రదేశాలలో ఉపరితల పగుళ్లు గమనించినట్లు తెలిపారు. ఇక్కడ విమానంలో ఉన్న వ్యవస్థకు 80 శాతం వరకు గడువు ముగిసింది. అదేవిధంగా చాలా పరికరాలకు గత సంవత్సరం గడువు ముగిసింది. వీటిని త్వరలో భర్తీ చేయాలని ఆయన పేర్కొన్నారు.

రష్యాకు చెందిన జర్యా కార్గో మాడ్యూల్ 1998 లో ప్రారంభమైంది. ప్రస్తుతం దీనిని నిల్వ(స్టోరేజ్) కోసం ఉపయోగిస్తున్నారు. ఇది కొనసాగితే, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం 2030 నాటికి పనికి రాదని రష్యన్ స్పేస్ ఏజెన్సీ చెబుతోంది.

అంతరిక్షంలో శాస్త్రీయ ప్రయోగాల కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నిర్మించబడింది. జూలైలో, రష్యా నిర్లక్ష్యం కారణంగా, ఈ అంతరిక్ష కేంద్రం నియంత్రించలేనిదిగా మారింది. ఈమధ్య కాలంలోనే.. స్పేస్ స్టేషన్ కొద్దిసేపు నియంత్రణ కోల్పోయింది. ఆ సమయంలో శాస్త్రవేత్తలు దీనిని సాఫ్ట్‌వేర్‌లో మానవ తప్పిదం అని పేర్కొన్నారు.



