- Telugu News Photo Gallery Rheumatoid arthritis can affect 18 34 years of young people also, know the symptoms here
Rheumatoid Arthritis: యువతలోనూ ఆర్థరైటిస్ వ్యాధి.. ఈ లక్షణాలు కనిపిస్తే అలసత్వం అస్సలు తగదు!
సాధారణంగా ముదుసలి వయసులో కీళ్లనొప్పుల సమస్యలు వస్తుంటాయి. దీనిని వాత వ్యాధి సమస్య అంటారు. వయస్సు పెరుగుతున్న కొద్దీ చేతులు, కాళ్ళలో నొప్పి, కీళ్లలో నొప్పులు వంటి సంభవిస్తుంటాయి. అయితే ఆర్థరైటిస్ ప్రాబల్యం ఇటీవల మరింత పెరిగింది. దీంతో యువతలో కూడా ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి. దీనిని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు..
Updated on: Sep 13, 2024 | 1:29 PM

సాధారణంగా ముదుసలి వయసులో కీళ్లనొప్పుల సమస్యలు వస్తుంటాయి. దీనిని వాత వ్యాధి సమస్య అంటారు. వయస్సు పెరుగుతున్న కొద్దీ చేతులు, కాళ్ళలో నొప్పి, కీళ్లలో నొప్పులు వంటి సంభవిస్తుంటాయి. అయితే ఆర్థరైటిస్ ప్రాబల్యం ఇటీవల మరింత పెరిగింది. దీంతో యువతలో కూడా ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి. దీనిని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు.

రుమటాయిడ్ ఆర్థరైటిస్ యువతలో కూడా ప్రబలుతున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా 18 నుంచి 34 ఏళ్ల మధ్య వయసున్న వారిలో పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా అందరిలో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి. అలసట, జ్వరం, ఆకలి లేకపోవడం, కీళ్ల నొప్పులు.. ఇఅన్నీ ఆర్థరైటిస్ నొప్పి కారణాలు. అసలు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏమిటంటే.. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక రకమైన ఆటో ఇమ్యూన్ వ్యాధి. బయటి సూక్ష్మజీవుల నుంచి మానవ శరీరాన్ని రక్షించే రోగనిరోధక వ్యవస్థ దాడి చేసి శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలను దెబ్బతీయడం ప్రారంభిస్తుంది. దీని వల్ల ఈ వ్యాధి వస్తుంది.

ఈ సమస్య శరీరంలోని కీళ్లను ప్రభావితం చేస్తుంది. ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు ప్రధాన కారణం అవుతుంది. ఇది మన శరీరంలోని ఇతర భాగాలను ప్రభావితం చేస్తుంది. చర్మం, కళ్లు, ఊపిరితిత్తులు, గుండె, రక్తనాళాల్లో కూడా సమస్యలు రావచ్చు. అయితే ఈ వ్యాధి రావడానికి సరైన కారణం అంటూ ఏమీలేదు. పర్యావరణ కారకాలు ఈ వ్యాధికి కారణం కావచ్చు. అలాగే ఈ వ్యాధి సంక్రమణకు కొన్ని రకాల బ్యాక్టీరియా, వైరస్‌లు కూడా కారణం అవుతాయి.

ఆర్థరైటిస్ కీళ్ళలో ఎక్కువగా సంభవిస్తుంది. ఇది విపరీతమైన నొప్పిని కలిగిస్తుంది. సకాలంలో చికిత్స చేయకపోతే కీళ్ల సమస్యలు పెరుగుతాయి. నొప్పి సంభవించే ప్రాంతం ఎర్రగా మారుతాయి. చాలా మంది దీనిని ఎముకల వ్యాధి అని అనుకుంటారు. కానీ అది అస్సలు కాదు. జ్వరం, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం వంటి అనారోగ్య లక్షణాలు ఈ వ్యాధి లక్షణాలు. కాబట్టి రుమటాయిడ్ ఆర్థరైటిస్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.

ఈ వ్యాధి లక్షణాలు మీలో కూడా కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. సకాలంలో చికిత్స చేయకపోతే ఈ వ్యాధి భయంకరమైన సమస్యగా మారుతుంది. వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. చాలా వరకు ఈ వ్యాధిని మందులతో నియంత్రించవచ్చు.




