- Telugu News Photo Gallery Real vs Fake Rudraksha: How to identify Genuine Rudraksha Beads? Know here
Real vs Fake Rudraksha: అసలు.. ఫేక్.. రుద్రాక్షలు గుర్తించలేకపోతున్నారా? చిటికెలో గుర్తించే చిట్కాలు ఇవే..
మెడలో రుద్రాక్ష ధరించడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు, ఒత్తిడి, ఆందోళన తగ్గి రక్తపోటు నియంత్రణలో ఉంటాయట. రుద్రాక్షల ఈ విధమైన డిమాండ్ ఉండబట్టే మార్కెట్లో కొందరు వ్యాపారులు మోసాలకు పాల్పడుతున్నారు. జనాల విశ్వాసంతో బహిరంగంగా ఆటలాడుతున్నారు. దేశంలో రుద్రాక్ష పేరుతో భద్రాక్షను అమ్ముతూ మోసాలకు పాల్పడుతున్నారు..
Updated on: Jul 27, 2025 | 8:17 PM

హిందూ మతంలో రుద్రాక్షకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. రుద్రాక్ష శివుని కన్నీళ్ల నుంచి ఉద్భవించాయని సనాతనుల నమ్మకం. రుద్రాక్షను ధరిస్తే వారి చెడు గ్రహాలు సరిదిద్దబడతాయని, వారు చేపట్టే అన్ని పనుల్లోనూ విజయం సాధిస్తారని నమ్మకం. అంతేకాదు రుద్రాక్ష ధరించని వారి జీవితం సంతోషంగా, విజయవంతంగా ఉంటుందని కూడా నమ్ముతారు.

మెడలో రుద్రాక్ష ధరించడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు, ఒత్తిడి, ఆందోళన తగ్గి రక్తపోటు నియంత్రణలో ఉంటాయట. రుద్రాక్షల ఈ విధమైన డిమాండ్ ఉండబట్టే మార్కెట్లో కొందరు వ్యాపారులు మోసాలకు పాల్పడుతున్నారు. జనాల విశ్వాసంతో బహిరంగంగా ఆటలాడుతున్నారు. దేశంలో రుద్రాక్ష పేరుతో భద్రాక్షను అమ్ముతూ మోసాలకు పాల్పడుతున్నారు.

ఎలియోకార్పస్ గనిట్రస్ జాతిని స్వచ్ఛమైన రుద్రాక్షగా పేర్కొంటారు. అలాగే ఎలియోకార్పస్ లాకునోసస్ జాతిని నకిలీ రుద్రాక్షలుగా పరిగణించారు. వీటిని కొన్ని శాస్త్రీయ పరీక్షల ద్వారా గుర్తించవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో ప్లాస్టిక్, ఫైబర్‌తో తయారు చేసిన రుద్రాక్షలు కూడా దర్శనమిస్తున్నాయి.

చాలా మంది వ్యాపారులు చెక్కతో రుద్రాక్షలను తయారు చేస్తున్నారు. విరిగిన రుద్రాక్షలను కలపడం ద్వారా కొత్త రుద్రాక్షలను తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. నిజమైన రుద్రాక్షకు సహజ రంధ్రాలు ఉంటాయి. నకిలీ రుద్రాక్ష ఆకారాన్ని ఇవ్వడానికి వ్యాపారులు రంధ్రాలు పెడతారు. నిజమైన రుద్రాక్షను ఆవ నూనెలో ముంచినట్లయితే దాని రంగు మసకబారదు. కానీ నకిలీ రుద్రాక్ష దాని రంగును వెంటనే కోల్పోతుంది.

నీటిలో వేసినప్పుడు నిజమైన రుద్రాక్ష మునిగిపోతుంది. నకిలీ రుద్రాక్ష మాత్రం నీటిపై తేలుతుంది. అలాగే నిజమైన రుద్రాక్షను గుర్తించడానికి ఏదైనా పదునైన వస్తువుతో రుద్దినప్పుడు దాని నుంచి ఏదైనా ఫైబర్స్ బయటకు వస్తే అది నిజమైన రుద్రాక్ష.




