AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీటిని నమ్ముకునే కంటే సూర్యుడిని నమ్మడం బెస్ట్ అంటున్న అక్కడి రైతులు

రాష్ట్రవ్యాప్తంగా ఎల్ నీనో ప్రభావంతో రైతులంతా క్రాప్ హాలిడే ప్రకటిస్తుంటే రాయలసీమలోని జమ్మలమడుగు నియోజకవర్గ రైతులు మాత్రం వినూత్నంగా ఆలోచించి నీటిని నమ్ముకునే కన్నా సూర్యుని నమ్ముకుంటే మేలని వారి భూములను సోలార్ విద్యుత్ సంస్థలకు లీజుకు ఇస్తున్నారు ఇప్పటికే నియోజకవర్గంలోని సగం మంది రైతులు ఇదే బాట పట్టారు.

Sudhir Chappidi
| Edited By: |

Updated on: Sep 07, 2026 | 6:33 PM

Share
రాష్ట్రవ్యాప్తంగా ఎల్ నీనో ప్రభావంతో రైతులంతా క్రాప్ హాలిడే ప్రకటిస్తుంటే రాయలసీమలోని జమ్మలమడుగు నియోజకవర్గ రైతులు మాత్రం వినూత్నంగా ఆలోచించి నీటిని నమ్ముకునే కన్నా సూర్యుని నమ్ముకుంటే మేలని వారి భూములను సోలార్ విద్యుత్ సంస్థలకు లీజుకు ఇస్తున్నారు ఇప్పటికే నియోజకవర్గంలోని సగం మంది రైతులు ఇదే బాట పట్టారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎల్ నీనో ప్రభావంతో రైతులంతా క్రాప్ హాలిడే ప్రకటిస్తుంటే రాయలసీమలోని జమ్మలమడుగు నియోజకవర్గ రైతులు మాత్రం వినూత్నంగా ఆలోచించి నీటిని నమ్ముకునే కన్నా సూర్యుని నమ్ముకుంటే మేలని వారి భూములను సోలార్ విద్యుత్ సంస్థలకు లీజుకు ఇస్తున్నారు ఇప్పటికే నియోజకవర్గంలోని సగం మంది రైతులు ఇదే బాట పట్టారు.

1 / 5
కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గం విద్యుత్ హబ్ గా అడుగులు వేస్తుంది.  ఇక్కడ ఉన్న రైతులు నీటి కొరతతో పంటలు వేయడం ఆపివేసి సోలార్ విద్యుత్ సంస్థలకు వాటిని లీజుకు ఇస్తున్నారు..  ఎకరాకు ప్రతి ఏటా మొదటి సంవత్సరం 33 వేల రూపాయలు ఆ తరువాత సంవత్సరం నుంచి పది శాతం లీజు పెంచుతూ డబ్బు చెల్లించే విధంగా సోలార్ విద్యుత్ సంస్థలు రైతుల నుంచి భూములను లీజుకు తీసుకుంటున్నాయి.

2 / 5
ఒకవేళ రైతులు వాటిని అమ్మితే కొనుక్కుంటున్నాయి .. ముఖ్యంగా జమ్మలమడుగు నియోజకవర్గంలో రాతి నేల ఎక్కువ.. ఇక్కడ భూగర్భ జలాలు చాలా తక్కువగా ఉంటాయి.  బోర్ వెయ్యాలి అంటే 350 నుంచి 450 అడుగుల లోతు వేయాల్సి ఉంటుంది అయినా నీరు పడుతుందో లేదో తెలియదు కేవలం వర్షాధారంతో పంటలు మాత్రమే ఇక్కడ పండుతాయి .

3 / 5
వర్షాలు పడకపోతే ఇక్కడ ఏడాదికి పండే ఒక్క పంట కూడా పండదు ఒకవేళ వర్షం పడింది కదా అని పంటలు వేస్తే అవి చేతికి వస్తాయో లేదో అనుమానమే ఇన్ని బాధలు పడే కన్నా పంటలు వస్తాయో రావో తెలియకుండా నష్టపోయే కన్నా నీటిని నమ్ముకునే కన్నా సూర్యుడిని నమ్ముకుంటే బెటర్ అంటున్నారు.

4 / 5
ప్రతి ఏటా క్రమం తప్పకుండా డబ్బులు వస్తాయి అని ఆలోచనతో కరువు ప్రాంతంలోని రైతులంతా సోలార్ విద్యుత్ సరఫరాకు వారి పొలాలను ఇస్తున్నారు రానున్న కాలంలో ఎక్కువగా సోలారే రాజ్యమేలుతుంది కాబట్టి ఇక్కడ రైతులు దానిని ఎంచుకొని వారి బాధలకు స్వస్తి చెప్పినట్లు అర్థమవుతుంది.

5 / 5
Follow Us