- Telugu News Photo Gallery Raw Garlic Side Effects, Raw Garlic, Garlic Side Effects, Garlic Side Effects in telugu, garlic, Health Tips, Health, Lifestyle
Raw Garlic Side Effects: పచ్చి వెల్లుల్లి మంచిది కదా అని తిన్నారంటే చిక్కుల్లో పడటం ఖాయం.. వీరు అస్సలు ముట్టుకోకూడదు
జలుబు వచ్చినా, స్కిన్ ఇన్‌ఫెక్షన్ అయినా, ఒక్క వెల్లుల్లి రెబ్బ తీసుకుంటే తక్షణ ఉపశమనం కలుగుతుంది. గుండె జబ్బులు, అధిక రక్తపోటు సమస్యలున్న వారికి కూడా వెల్లుల్లి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియల్, క్రిమినాశక లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి..
Updated on: Jun 27, 2024 | 9:35 PM

జలుబు వచ్చినా, స్కిన్ ఇన్‌ఫెక్షన్ అయినా, ఒక్క వెల్లుల్లి రెబ్బ తీసుకుంటే తక్షణ ఉపశమనం కలుగుతుంది. గుండె జబ్బులు, అధిక రక్తపోటు సమస్యలున్న వారికి కూడా వెల్లుల్లి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియల్, క్రిమినాశక లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.

ఆయుర్వేద ఔషధం ప్రకారం.. పచ్చి వెల్లుల్లి రెబ్బను వేడి అన్నంతో కలిపి తింటే శరీరం ఫిట్‌గా ఉంటుంది. కానీ పచ్చి వెల్లుల్లి అందరూ తినకూడదు. ఎవరు తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం.. చలికాలంలో శరీరాన్ని వేడిగా ఉంచుకోవడానికి పచ్చి వెల్లుల్లి తినడం చాలా మంచిది. కానీ వేసవి కాలంలో పచ్చి వెల్లుల్లి తినడం వల్ల శారీరక సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి తినే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. అలాగే గర్భిణీలు, పాలిచ్చే మహిళలు పచ్చి వెల్లుల్లి తినకూడదు.

పచ్చి వెల్లుల్లి ఎంత ప్రయోజనకరమో, జీర్ణం కావడం అంతే కష్టం. అందుకే చిన్న పిల్లలకు పచ్చి వెల్లుల్లి తినిపించకూడదు. అలాగే వెల్లుల్లి రక్తాన్ని పలుచగా చేస్తుంది. కాబట్టి బ్లడ్ థినర్స్ ఉన్నవారు పచ్చి వెల్లుల్లిని తినకూడదు.

Health Benefits Of Garlic

కడుపు పూతలతో బాధపడేవారు పచ్చి వెల్లుల్లిని తినడం మానుకోవాలి. పచ్చి వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కాలేయంలో టాక్సిన్స్ పేరుకుపోకుండా నివారిస్తాయి. కానీ పచ్చి వెల్లుల్లిని ఎక్కువగా తినడం వల్ల కడుపులో చికాకు, వాంతులు, విరేచనాలు వస్తాయి. అధిక రక్తపోటును తగ్గించడంలో పచ్చి వెల్లుల్లి ప్రభావవంతంగా పనిచేస్తుంది. రక్తహీనత, తక్కువ రక్తపోటు సమస్య ఉన్నవారు పచ్చి వెల్లుల్లిని తినకూడదు. అప్పుడు రక్తపోటు స్థాయి మరింత తగ్గే ప్రమాదం ఉంది.




