- Telugu News Photo Gallery Political photos Model turned politician diksha singh life profile and photos
Who is Diksha Singh: దేశం దృష్టిని ఆకర్షించిన దీక్షాసింగ్.. అందాల పొలిటిషియన్‌పై అందరి చూపు.. ఇంతకీ ఎవరిమే?
Who is Diksha Singh: ప్రస్తుతం సోషల్ మీడియాలో దీక్షా సింగ్ అనే పేరు బాగా వినిపిస్తోంది. చిన్న పంచాయతీ స్థానానికి పోటీ చేస్తోన్న అభ్యర్థి పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. దీనికి కారణం ఆమె అందం..
Updated on: Apr 05, 2021 | 9:37 AM

మరికొన్ని రోజుల్లో ఉత్తరప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అందరి చూపు జాన్‌పూర్ జిల్లా బక్షా డెవలప్‌మెంట్ బ్లాక్ పంచాయతీ స్థానంపై పడింది.

ఇక్కడి 26వ వార్డు నుంచి దీక్షాసింగ్ అనే అభ్యర్థి పోటీ చేస్తుండడమే దీనికి కారణం. ఇప్పుడు ఈమెపైనే అందరి దృష్టిపడింది.

తండ్రి జితేంద్ర సింగ్ వారసత్వంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తోందీ అందాల పొలిటిషియన్. 1997లో చిత్తోరి గ్రామంలో జన్మించింది దీక్షాసింగ్. మూడో తరగతి వరకు అక్కడే చదువుకున్న దీక్షా అనంతరం ముంబయి.. ఆ తర్వాత గోవా వెళ్లింది.

24 ఏళ్ల దీక్షాసింగ్.. గోవాలోని ఎమ్‌ఈఎస్ ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత దీక్షా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది.

తనదైన అందంతో ఆకట్టుకున్న దీక్షాసింగ్ 2015 మిస్ ఇండియా పోటీల్లో ఫైనలిస్ట్‌గా రాణించింది. ఇక 2020లో ప్రైవేటు వీడియో ఆల్బమ్‌లో తళుక్కుమంది.

దీక్షాసింగ్‌కు సోషల్ మీడియాలోనూ భారీ ఫాలోయింగ్ ఉంది. ఈమెను ఏకంగా 2.80 లక్షల మంది ఫాలో అవుతున్నారు.

కేవలం మోడలింగ్‌లోనే కాకుండా దీక్షాసింగ్ 'ఇష్క్ తేరా' అనే కథను కూడా రాసింది. వీటితో పాటు ఓ వెబ్ సిరీస్, కొన్ని ప్రకటనల్లోనూ నటించింది.




