- Telugu News Photo gallery Political photos CM KCR Unveiling BRS Party Flag at Telangana Bhavan Telugu Political Photos
CM KCR Unveiling BRS Party Photos: ఢిల్లీ కోటపై బీఆర్‌ఎస్ జెండా ఎగురుతుంది: కేసీఆర్. నూతన పార్టీ ఫొటోస్..
BRS ఆవిర్భావంతో పార్టీ శ్రేణుల్లో సరికొత్త జోష్ కనిపిస్తోంది. తెలంగాణ మాదిరిగానే దేశాన్ని అభివృద్ధి చేస్తామని ధీమాగా చెబుతున్నారు నేతలు. " అబ్ కీ బార్ కిసాన్ సర్కార్" అన్న నినాదాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Updated on: Dec 09, 2022 | 4:47 PM

BRS ఆవిర్భావంతో పార్టీ శ్రేణుల్లో సరికొత్త జోష్ కనిపిస్తోంది. తెలంగాణ మాదిరిగానే దేశాన్ని అభివృద్ధి చేస్తామని ధీమాగా చెబుతున్నారు నేతలు. " అబ్ కీ బార్ కిసాన్ సర్కార్" అన్న నినాదాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు.

" అబ్ కీ బార్ కిసాన్ సర్కార్" ఇది బీఆర్‌ఎస్ నినాదం. అంటే ఈసారి రైతు ప్రభుత్వం అని అర్థం. రైతులు- వ్యవసాయమే ప్రధాన ఎజెండా ముందుకు వెళ్లనుంది BRS. త్వరలోనే జాతీయ విధానాన్ని ప్రకటించనున్నారు KCR.

ఢిల్లీ ఎర్రకోటపై ఎగిరేది గులాబీ జెండానే అని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే కర్నాటక ఎన్నికల్లో జేడీఎస్‌కు కలిసి పోటీచేస్తామని ప్రకటించారు. అటు ఏప్రిల్‌నాటికి ఢిల్లీలో BRS కార్యాలయం ప్రారంభం కానుంది.

2001లో తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి 13 ఏళ్ల తర్వాత ఆ గమ్యాన్ని ముద్దాడింది.

BRS తొలి టార్గెట్ కర్నాటక ఎన్నికలు. 2023 మేలోపు ఈ ఎన్నికలు జరుగుతాయి. BRS తొలి ప్రస్థానం కన్నడ గడ్డపై నుంచే మొదలవుతుంది. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో JDS తో కలిసి పోటీ చేయనుంది BRS. గుల్బర్గా నుంచి బీదర్ వరకు ఏడు జిల్లాల్లో పోటీ చేయనుంది BRS.

తెలంగాణ రాష్ట్ర సమితి BRSగా మారిపోయింది. పార్టీ చరిత్రలో నవశకం మొదలైంది. 21 ఏళ్ల ఉద్యమపార్టీ ప్రస్థానంలో ఇది సరికొత్త చరిత్ర.

వరుసగా రెండు సార్లు అధికారం చేపట్టిన TRS.. 8 ఏళ్ల తర్వాత భారత్ రాష్ట్రసమితిగా మారిపోయింది. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సమాయత్తమైంది.

ముందుగానే నిర్ణయించిన దివ్యముహూర్తం ప్రకారం..సరిగ్గా 1:20 నిమిషాలకు ఈసీ పంపిన BRS పత్రాలపై సంతకం చేశారు CM కేసీఆర్..! అనంతరం BRS జెండాను ఆవిష్కరించారు..!

శంషాబాద్ మెట్రోకు శంకుస్థాన చేసిన తర్వాత.. అక్కడి నుంచి నేరుగా తెలంగాణభవన్‌కు చేరుకున్నారు CM కేసీఆర్.. పార్టీ శ్రేణులు భారీగా స్వాగతం పలికాయి. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు..!





























