- Telugu News Photo Gallery Oneplus officially announced its first foldable smartphone oneplus open, Check here for features and price details
OnePlus Open: మడతపెట్టే ఫోన్‌పై వన్‌ప్లస్ అధికారిక ప్రకటన.. మార్కెట్లోకి ఎప్పుడు రానుందంటే.
టెక్ మార్కెట్లో ప్రస్తుతం ఫోల్డబుల్ ఫోన్స్ హంగామా పెరిగింది. ఇప్పటికే పలు బ్రాండెండ్ కంపెనీలు ఫోల్డబుల్ ఫోన్‌లను లాంచ్ చేయగా తాజాగా వన్‌ప్లస్ సైతం కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. వన్‌ప్లస్ ఓపెన్ పేరుతో ఈ ఫోల్డబుల్ ఫోన్‌ను లాంచ్ చేశార. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
Updated on: Dec 06, 2023 | 12:39 PM

ఎట్టకేలకు వన్‌ప్లస్ సంస్థ తన తొలి ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని సంస్థ అధికారికంగా ప్రకటించింది. వన్‌ప్లస్ ఓపెన్ పేరుతో తీసుకురానున్న ఈ ఫోన్‌కు సంబంధించిన టీజర్‌ను కంపెనీ ఆన్‌లైన్ విడుదల చేసింది.

ఈ నెల చివర్లో లేదా వచ్చే నెల ప్రారంభంలో ఈ స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు వన్‌ప్లస్ సన్నాహాలు చేస్తోంది. ఈ ఫోల్డబుల్ ఫోన్‌కు సంబంధించి పాక్షికంగా మడతపెట్టిన రూపంలో ఉన్న ఫొటోను వన్‌ప్లస్ షేర్ చేసింది.

ఈ ఫోన్ స్లీక్ బ్లాక్ కలర్ వేరియంట్‌లో ఆకట్టుకునే డీస్‌ప్లేతో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక టీజర్‌ను గమనిస్తే డివైజ్‌కి లెఫ్ట్ సైడ్ అలర్ట్ స్లైడర్, రైట్ సైడ్ వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఇవ్వనున్నట్లు స్పష్టమవుతోంది.

ఇక ధర విషయానికొస్తే వన్‌ప్లస్ ఓపెన్ ధర భారత్‌లో దాదాపు రూ. 1.2 లక్షలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఐఫోన్‌కు సమానమైన ధరతో లాంచ్ కానున్న ఈ ఫోన్‌పై భారీగానే అంచనాలు ఉన్నాయి.

ఇక ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే 7.82 ఇంచ్ ఓఎల్ఈడీ ఇన్నర్ స్క్రీన్, 6.31 ఇంచ్ ఓఎల్ఈడీ అవుటర్ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. ఆక్టా-కోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ఎస్ఓసీ ప్రాసెసర్‌తో పని చేయనుంది. ట్రిపుల్ కెమెరా సెటప్‌తో ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఇక ఇందులో 100 వాట్స్‌కి సపోర్ట్ చేసే 4805 ఎంఏహెచ్ బ్యాటరీని ఇవ్వనున్నారు.





























